మహేష్ , తారక్ తరువాత బన్నీకే..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒకసారి జరిగిన మ్యాజిక్ మరోసారి జరగడం చాలా తక్కువ సందర్భాల్లోనే వీలవుతుంది. యువ సంగీత సంచలనం ఎస్.థమన్ కి కూడా అలాంటి సందర్భాలున్నాయి. అదేమిటంటే.. ఫస్ట్ టైమ్ ఓ హీరోతో హిట్ కొట్టిన తనకి రెండోసారి అదే రిపీట్ అవడం ముగ్గురు కథానాయకుల చిత్రాల విషయంలోనే చోటుచేసుకుంది. ఆ ముగ్గురు కథానాయకులు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.
'దూకుడు'తో మహేష్ కాంబినేషన్లో తొలిసారిగా అచ్చొచ్చిన థమన్.. 'బిజినెస్‌మేన్'తో రెండోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేశాడు. అలాగే తారక్‌తో 'బృందావనం' కోసం తొలిసారిగా కలిసి పనిచేసిన సదరు సంగీత దర్శకుడు వారి కలయికలో వచ్చిన రెండో చిత్రం 'బాద్షా'తో ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేశాడు. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరిన మూడో హీరో పేరు అల్లు అర్జున్.
రెండేళ్ల క్రితం 'రేసు గుర్రం' వంటి హిట్ చిత్రం కోసం తొలిసారిగా బన్నికి బాణీలిచ్చిన థమన్, ఈ ఏడాది 'సరైనోడు' కోసం మరోసారి కలిసి పనిచేసి మరో హిట్ కొట్టాడు. మహేష్, తారక్ తరువాత బన్నీకే థమన్ విషయంలో ఈ మ్యాజిక్ జరిగింది. నాగార్జున, వెంకటేష్, రామ్‌చరణ్, రవితేజ విషయంలో మాత్రం ఈ విషయంలో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయాడు థమన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com