అప్పుడు మహాలక్ష్మి.. ఇప్పుడు రామలక్ష్మి
Send us your feedback to audioarticles@vaarta.com
కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా...నాయికా ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటిస్తూ కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు సమంత అక్కినేని. తన తొలి చిత్రం ఏ మాయ చేసావే`లో తన అందంతో, నటనతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ చెన్నై చిన్నది.. ఇటీవల విడుదలైన రాజు గారి గది 2`లో కూడా నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ప్రస్తుతం సమంత రంగస్థలం`లో కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ కథానాయకుడు.
ఇదిలా వుంటే.. సుకుమార్ సినిమాల్లో కథానాయకుల పాత్రలు వైవిధ్యంగా ఉంటాయి.. కానీ కథానాయికలకు అంతగా ప్రాధాన్యం ఉండదు. అయితే, ఆయన సినిమాల్లో హీరోతో పాటు సమానంగా ఉండే హీరోయిన్ పాత్ర అంటే.. అది 100% లవ్`లో తమన్నా పోషించిన మహాలక్ష్మి మాత్రమే. మళ్ళీ అలా నటనకు ప్రాధాన్యం ఉన్న కథానాయిక పాత్రగా రంగస్థలం`లోని రామలక్ష్మి పాత్రని డిజైన్ చేశారు సుకుమార్. అంతేగాకుండా, రామలక్ష్మి పాత్ర కోసం సమంతని డీ గ్లామర్ లుక్లో ప్రజెంట్ చేస్తున్నారాయన. ఇప్పటికే సమంత లుక్కు, ఆమె పై చిత్రీకరించిన 'ఎంత సక్కగున్నావే' పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి.. మహాలక్ష్మిలాగే రామలక్ష్మి కూడా స్క్రీన్ పై మెప్పిస్తుందా? మార్చి 30 వరకు వేచిచూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com