మెట్రోలో ఉద్యోగం పోవడంతో... హెర్బల్ టీతో అమెజాన్‌ను మెప్పించాడు..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా మహమ్మారి ఎందరి జీవితాలనో ఛిద్రం చేసేసింది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం వెలుగులు నింపింది. ఢిల్లీ మెట్రోలో పనిచేస్తూ.. జీవితం కష్టనష్టాలతో గడుపుకొస్తున్న ఓ వ్యక్తి జీవితాన్ని కరోనా మహమ్మారి ఛిద్రం చేసేసింది. లాక్డౌన్ కారణంగా మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉత్తరాఖండ్‌లోని అల్మోడా జిల్లా, నౌవాడా గ్రామానికి చెందిన దాన్ సింగ్ ఉద్యోగాన్ని కోల్పోయాడు. తరువాత ఎంత ప్రయత్నించినా అతనికి ఉద్యోగం దొరకలేదు. దీంతో స్వగ్రామానికి చేరుకున్నాడు.
ఏ మహమ్మారి కారణంగా అయితే దాన్ సింగ్ తన ఉద్యోగాన్ని కోల్పోయాడో అదే మహమ్మారి ఉపాధిని చూపించింది. కరోనా సమయంలో హెర్బల్ టీకి డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకుని దాన్ సింగ్ హెర్బల్ టీ స్టాల్ పెట్టుకున్నాడు. దాన్ సింగ్ హెర్బల్ టీకి డిమాండ్ ఏర్పడటానికి పెద్దగా సమయం కూడా పట్టలేదు. అనతి కాలంలోనే బాగా డిమాండ్ ఏర్పడింది. దీంతో నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తూ స్వగ్రామంలో చాలా హ్యాపీగా జీవితాన్ని సాగిస్తున్నాడు.
ఈ సందర్భంగా దాన్ సింగ్ మాట్లాడుతూ ఉత్తరాఖండ్‌లో వలసలు అధికంగా ఉంటాయని... గ్రామంలో కొద్దమంది యువకులు మాత్రమే ఉన్నారన్నారని తెలిపాడు. కరోనా సమయంలో ఉద్యోగం పోవడంతో గ్రామానికి వచ్చేశానని... కరోనా బారిన పడకుండా ఉండేందుకు అందరూ ఇమ్యూనిటీ బూస్టర్లపై ఆధారపడ్డారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలోనే హెర్బల్ టీకి డిమాండ్ పెరగడాన్ని గుర్తించానన్నాడు.
తమ ప్రాంతంలో లభించే ఒక ప్రత్యేకమైన గడ్డిని పెద్దలు జ్వరాలు, తలనొప్పులు, జలుబు మొదలైనవాటి విరుగుడుకు వినియోగిస్తుంటారని... ఆ గడ్డితోనే టీ తయారు చేసి, విజయం సాధించానని దాన్ సింగ్ చెప్పాడు. తన స్నేహితుల సహాయంతో ఈ హెర్బల్ టీ విక్రయాలను ప్రారంభించానని... ఈ టీ అందరికీ నచ్చడంతోపాటు.. ఆరోగ్యప్రదాయినిగా మారడంతో ప్రజల నుంచి డిమాండ్ పెరిగిందని దాన్ సింగ్ వెల్లడించాడు. కొద్ది రోజుల్లోనే ప్రముఖ ఆన్లైన్ దిగ్గజ సంస్థ అమెజాన్‌ని మెప్పించి దానితో ఒప్పందం కుదుర్చుకుని విక్రయాల స్థాయిని పెంచుకోగలిగానని వెల్లడించాడు. ఇప్పుడు ఉద్యోగం కన్నా ఈ వ్యాపారమే బాగుందని దాన్ సింగ్ తెలిపాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com