పవన్, మహేష్, ప్రభాస్ ఒకే ఒక్కసారి.. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బాక్సాఫీస్ ఫైట్!
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు ప్రేక్షకులకు సంక్రాంతికి కోడి పందేలు ఎలాగో.. సినిమాలు అలాగ. పల్లెటూర్లలో కోడి పందేలతో ఎంజాయ్ చేయడం.. ఫ్యామిలీతో సినిమాకి వెళ్లడం సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులు చేసే పని. అందుకే సంక్రాంతి డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని వీలైనన్ని ఎక్కువ చిత్రాలు బరిలో దిగుతుంటాయి.
ఇదీ చదవండి: శ్రీదేవి సోడా సెంటర్ టీజర్: అప్పటి నుంచి నా పేరు సోడాలు శ్రీదేవి అయింది
ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ సమరం ఊహించని విధంగా రంజుగా మారబోతోంది. బాక్సాఫీస్ ని బద్దలు కొట్టే గండర గండులు లాంటి హీరోలు పోటీకి దిగుతున్నారు. వారే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సూపర్ స్టార్ మహేష్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.
పవన్, రానా మల్టీస్టారర్ చిత్రం అయ్యప్పన్ కోషియం రీమేక్ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్నట్లు ఇటీవలే అధికారింగా ప్రకటించారు. మహేష్ సర్కార్ వారి పాట చిత్రం ఆల్రెడీ పొంగర్ బెర్త్ ఖరారు చేసుకుంది. వీరిద్దరికి తోడుగా హీట్ పెంచుతూ ప్రభాస్ తన రాధే శ్యామ్ చిత్రం కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతున్నట్లు అనౌన్స్ చేసేశాడు.
ఈస్థాయిలో ముగ్గురు స్టార్ హీరోలు ఒకేసారి బరిలోకి దిగడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి ఏమో. దాదాపు 15 ఏళ్ల క్రితం ఈ స్టార్ హీరోల ముగ్గురు మధ్య ఇంత క్లోజ్ గా కాకున్నా చిన్న పాటి ఫైట్ జరిగింది. 2006లో సమ్మర్ కి దాదాపు నెలరోజుల వ్యవధిలో ప్రభాస్ పౌర్ణమి, పవన్ కళ్యాణ్ బంగారం, మహేష్ బాబు పోకిరి చిత్రాలు రిలీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇదే అంశం గురించి చర్చించుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ కోషియం రీమేక్, మహేష్ సర్కార్ వారి పాట చిత్రాలు మాస్ అంశాలతో తెరకెక్కుతున్నాయి. ఇక ప్రభాస్ రాధే శ్యామ్ చిత్రం అద్భుతమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్, రానా చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. మహేష్ సర్కార్ వారి పాట చిత్రాన్ని గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తెరకెక్కిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. సో టాలీవుడ్ బాక్సాఫీస్ కనీవినీ ఎరుగని సమరానికి వేదిక కాబోతోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com