అప్పుడు కృష్ణ, ఇ.వి.వి- ఇప్పుడు మహేష్, అల్లరి నరేష్
Send us your feedback to audioarticles@vaarta.com
కొన్ని కొన్ని విషయాలు యాదృచ్ఛికంగా జరిగినా వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి ఓ విషయమే కృష్ణ, మహేష్ బాబు విషయంలో చోటు చేసుకోనుంది. కాస్త వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ కృష్ణ ఇప్పటివరకు 350కి పైగా చిత్రాలలో నటించిన విషయం తెలిసిందే.
100వ చిత్రంగా అల్లూరి సీతారామరాజు, 200వ చిత్రంగా ఈనాడు, 300వ చిత్రంగా తెలుగు వీర లేవరా చేసి తన అభిరుచి చాటుకున్నారు కృష్ణ. ఈ మూడు మైల్ స్టోన్ మూవీస్‌లో తెలుగువీర లేవరా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఈ సినిమాకి.. అప్పట్లో వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించారు.
ఫలితం సంగతి పక్కనపెడితే.. కృష్ణ 300వ చిత్ర దర్శకుడిగా ఇ.వి.వికి ప్రత్యేక స్థానముంది. కట్ చేస్తే.. ప్రస్తుతం కృష్ణ వారసుడు మహేష్ బాబు నటిస్తున్న 25వ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో నటించే అవకాశం ఇ.వి.వి.తనయుడు అల్లరి నరేష్‌ను వరించింది.
నాడు కృష్ణ మైల్ స్టోన్ సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ ఇ.వి.వి కి దక్కితే.. ఇప్పుడు మహేష్ మైల్ స్టోన్ మూవీలో నటించే ఆఫర్ ఇ.వి.వి.తనయుడు అల్లరి నరేష్ దక్కడం విశేషమనే చెప్పాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com