నిన్నకబాలి - నేడు ఖైదీ నెం 150..!
- IndiaGlitz, [Monday,January 09 2017]
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సంచలన చిత్రం కబాలి. ఈ చిత్రం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. గత సంవత్సరం జులై 22న కబాలి రిలీజ్ సందర్భంగా బెంగుళూరు, చెన్నై, లతో పాటు సౌదీ అరేబియాలోను కొన్ని కంపెనీలు ఉద్యోగులకు సెలవు ప్రకటించారు. ఇదిలా ఉంటే...తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 రిలీజ్ సందర్భంగా ఈనెల 11న రియాద్ లోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ సెలవు ప్రకటించడం విశేషం.
ఈ విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు. అంతే కాకుండా ఆ సంస్థ సెలవు ప్రకటించడాన్ని తెలియచేస్తూ నోటీసును కూడా పోస్ట్ చేసాడు. దాదాపు పదేళ్ల తర్వాత చిరంజీవి నటించిన సినిమా కావడంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను ఖైదీ నెం 150 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి...రిలీజ్ కు ముందు ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఖైదీ నెం 150 రిలీజ్ తర్వాత ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి..!