Komatireddy Venkat Reddy:జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం: కోమటిరెడ్డి
Send us your feedback to audioarticles@vaarta.com
లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. తమ కుటుంబసభ్యురాలైన కవిత జైలుకు వెళ్లిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయామనే ఫ్రస్టేషన్‌లో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యం గా ఉన్నాయని.. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకా.. 30 వేల ఉధ్యోగ నియామకాలు చేపట్టినందుకా.. రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిట్టేది అని మండిపడ్డారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ పదవి కేటీఆర్‌కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు మానుకుని.. కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే బెటర్ అని సలహా ఇచ్చారు. కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని.. ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లకు తగ్గకుండా గెలుచుకుంటామని.. బీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు కూడా రాదని.. కనీసం రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పామన్నారు. అంతేకానీ దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని తాము ఎక్కడా చెప్పలేదన్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout