అప్పుడు రాజశేఖర్, జీవిత.. ఇప్పుడు శివాని
Send us your feedback to audioarticles@vaarta.com
లిజీ.. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ సీనియర్ నటి. దర్శకుడు ప్రియదర్శన్‌ను పెళ్ళాడాక సినిమాలకు దూరమైన లిజీ.. చాలా కాలం గ్యాప్ తరువాత ఛల్ మోహన్ రంగతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్ తల్లి పాత్రలో లిజీ కనిపించనున్నారు.
ఈ సినిమా విడుదలయ్యే లోపే.. మరో అవకాశం లిజిని వరించిన సంగతి తెలిసిందే. హిందీలో విజయం సాధించిన 2 స్టేట్స్ ఆధారంగా రూపొందుతున్న ఈ రీమేక్ ద్వారా రాజశేఖర్ కుమార్తె శివాని కథానాయికగా పరిచయం కానుంది.
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. 28 ఏళ్ళ క్రితం రాజశేఖర్, జీవిత జంటగా నటించిన మగాడు చిత్రంలో లిజీ కథకు కీలకమైన పాత్రలో కనిపించారు. అప్పుడు ఆ సినిమా మంచి విజయం సాధించింది. కట్ చేస్తే.. ఇప్పుడు వాళ్ళ కుమార్తె శివానితో కలిసి లిజీ నటిస్తున్నారు. అప్పుడు రాజశేఖర్, జీవితకి కలిసొచ్చిన లిజి.. ఇప్పుడు శివాని కి కి కూడా కలిసొస్తారేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments