నిన్న జగపతి - నేడు రానా..!
- IndiaGlitz, [Wednesday,October 05 2016]
జురాసిక్ పార్క్ , జాస్, ఇండియానా జోన్స్ వంటి అద్భుతమైన చిత్రాల రూపకర్త స్టీవెన్ స్పిల్ బర్గ్ దర్శకత్వం లో రూపొందిన అద్భుతమైన ఫాంటసి ది బి ఎఫ్ జి (ది బిగ్ ఫ్రెండ్లీ జయంట్) చిత్రంలో ని ప్రధాన పాత్రకు జగపతి బాబు డబ్బింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దగ్గుబాటి రానా టామ్ హ్యాంక్స్ నటించిన ఇన్ఫెర్నో చిత్రానికి డబ్బింగ్ చెప్పడం విశేషం. హాలీవుడ్ మూవీ ఇన్ఫెర్నో ఈనెల 28న యు.ఎస్ లో రిలీజ్ అవుతుంది.భారీ యాక్షన్ మూవీగా రూపొందించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. ఈ తెలుగు వెర్షెన్ లో టామ్ హ్యాంక్స్ క్యారెక్టర్ కు రానా డబ్బింగ్ చెప్పారు. ఈ చిత్రానికి రోన్ హో వార్డ్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రాన్ని ఇండియాలో సోని పిక్చర్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈనెల 14న తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రిలీజ్ చేస్తుంది. ఈ చిత్రాన్ని యు.ఎస్ కంటే రెండు వారాలు ముందుగా ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ఈ హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పడం గురించి రానా స్పందిస్తూ.....టామ్ హ్యాంక్స్ క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పడం వలన ఆయన పర్ ఫార్మెన్స్ చూసి చాలా నేర్చుకున్నాను. నాకు ఇది ఎంతగానో హోల్ప్ అయ్యింది. హాలీవుడ్ మూవీస్ కి ఇర్ఫాన్ ఖాన్, ఓంపురి తదితరులు హాలీవుడ్ మూవీస్ కి డబ్బింగ్ చెబుతున్నారు. గ్రేట్ స్టోరీ ఎక్కువ మందికి రీచ్ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ మూవీకి డబ్బింగ్ చెప్పాను అన్నారు.