నిన్న గోపీచంద్... నేడు అజిత్..
Send us your feedback to audioarticles@vaarta.com
కెమెరామేన్ నుంచి డైరెక్టర్‌గా టర్న్ అయిన 'శౌర్యం' శివ.. ప్రస్తుతం తమిళంలో అజిత్ తో 'వేదాళం' అనే సినిమా రూపొందిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులోనూ అనువాద రూపంలో రానున్న ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాని బ్రదర్, సిస్టర్ సెంటిమెంట్ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ టచ్‌తో శివ టేకాఫ్ చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. విశేషమేమిటంటే.. తను డైరెక్ట్ చేసిన తొలి చిత్రం 'శౌర్యం' కూడా ఇదే విధంగా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమానే ప్రభుదేవా 'వెడి' పేరుతో విశాల్, సమీరా రెడ్డి జంటగా రీమేక్ చేసి ఫరవాలేదనిపించే రిజల్ట్‌ని సొంతం చేసుకున్నాడు. మరి గోపీచంద్‌తో సిస్టర్ సెంటిమెంట్‌తో హిట్ కొట్టిన శివ.. అజిత్‌తోనూ అదే సెంటిమెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తాడేమో చూడాలి. 'సిరుత్తై', 'వీరమ్' చిత్రాల తరువాత శివ నుంచి వస్తున్న 'వేదాళం' హిట్ అయితే గనుక అతని ఖాతాలోకి కోలీవుడ్ సినిమాల పరంగా హ్యాట్రిక్ దక్కినట్టే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com