అప్పుడు గోపీచంద్‌..ఇప్పుడు నారా రోహిత్‌...

  • IndiaGlitz, [Thursday,October 26 2017]

హీరోగా నుండి విల‌న్‌గా మారిన న‌టులు చాలా మంది మ‌న‌కు తెలుగులో క‌న‌ప‌డ‌తారు. ఇప్ప‌టి యువ క‌థానాయ‌కుల్లో హీరో గోపీచంద్‌..ముందు హీరోగా ఎంట్రీ ఇచ్చిన జ‌యం, వ‌ర్షం, నిజం చిత్రాల్లో విల‌న్‌గా న‌టించాడు. ఇందులో జ‌యం, నిజం చిత్రాల‌ను తేజ‌నే డైరెక్ట్ చేశాడు. త‌ర్వాత గోపీచంద్ హీరోగా మారాడ‌నుకోండి.

ఈ సంగ‌తిని ప‌క్క‌న పెడితే, త్వ‌ర‌లోనే నారా రోహిత్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. గ‌తంలో హీరోను విల‌న్‌గా ప‌రిచ‌యం చేసిన తేజ ఇప్పుడు నారా రోహిత్‌ను విల‌న్‌గా ప‌రిచ‌యం చేయ‌నున్నాడ‌న్న‌మాట‌. తేజ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్‌తో రూపొందించ‌నున్న చిత్రంలో నారా రోహిత్ విల‌న్‌గా క‌నిపిస్తాడ‌ని స‌మాచారం.

More News

ఏప్రిల్‌ 27న మ‌హేష్ 'భ‌ర‌త్ అను నేను'

సూపర్‌స్టార్‌ మహేష్‌, సూపర్‌ డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌ఎల్‌పి బేనర్‌పై సూపర్‌హిట్‌ చిత్రాల నిర్మాత డి.వి.వి.దానయ్య ప్రొడక్షన్‌ నెం.3గా నిర్మిస్తున్న భారీ చిత్రం షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

మెలోడీ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌తో సాయిధ‌ర‌మ్‌?

తొలి ప్రేమ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేసిన ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఆ త‌రువాత వాసు, బాలు, హ్యాపీ, ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు మ‌రింత చేరువ‌య్యారు.

'డ్రైవర్ రాముడు' గా షకలక శంకర్

డ్రైవర్ రాముడు చిత్రం అనగానే నందమూరి తారక రామారావు గారు మాత్రమే గుర్తుకొస్తారు. ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ చిత్రాల్లో డ్రైవర్ రాముడు ఒకటి.

తేజ‌, బాల‌య్య టైటిల్ ఫిక్స్ అయ్యిందా?

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో స్వ‌ర్గీయ ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ న‌టుడిగా ప్ర‌స్థానం ప్రారంభించి, ముఖ్య‌మంత్రిగా ఎదిగిన వైనాన్ని తేజ త‌న ద‌ర్శ‌క‌త్వంలో చూపించ‌బోతున్నారు.

అనిల్‌కు బ‌న్ని ఛాన్స్‌...

ప‌టాస్‌, సుప్రీమ్‌, రాజా ది గ్రేట్ చిత్రాల త‌ర్వాత ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి ఏ సినిమా చేస్తాడ‌నే దానిపై క్లారిటీ లేదు. కొన్ని రోజుల క్రితం అనిల్ రావిపూడి బాల‌య్య సినిమా మొద‌లవుతుంద‌ని కూడా వార్త‌లు వచ్చాయి.