RRR Movie : గోల్డెన్ గ్లోబ్ జోష్‌లో వుండగానే.. కీరవాణికి మరో ప్రతిష్టాత్మక పురస్కారం, నెక్ట్స్ టార్గెట్ ఆస్కారే
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కడంతో టాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినిమా సంబరాల్లో మునిగిపోయింది. ఇప్పటికే వివిధ ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఆనందంలోనే వుండగానే.. ఆర్ఆర్ఆర్ మూవీకి మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్ లభించింది. ప్రజంట్ అమెరికాలో వున్న కీరవాణి ఈ అవార్డ్‌ను అందుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను ఆర్ఆర్ఆర్ యూనిట్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. దీంతో నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఆస్కార్ వేటలో ఆర్ఆర్ఆర్ యూనిట్ :
ఇకపోతే.. ఆర్ఆర్ఆర్ యూనిట్ గత కొన్ని రోజులుగా అమెరికాలో వుంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ హాలీవుడ్లో అవార్డుల పంట పండిస్తున్నారు. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంతో .. ఈ జోష్‌తో ఎలాగైనా ఆస్కార్ అవార్డ్ కొట్టాలని రాజమౌళి తీవ్రంగా శ్రమిస్తున్నారు. దీనిలో భాగంగా వరుసపెట్టి అమెరికన్ మీడియాతో, అక్కడి సినిమా వాళ్లతో ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇంటరాక్ట్ అవుతోంది. జక్కన్న ప్రయత్నం ఫలించి ఆర్ఆర్ఆర్కి ఆస్కార్ రావాలని కోరుకుందాం.
1200 వందల కోట్ల వసూళ్లు సాధించిన ఆర్ఆర్ఆర్:
ఇదిలావుండగా.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ లో విశేషాలు బోలెడు. తెలుగు సినిమాను శాసించే రెండు పెద్ద కుటుంబాలకు చెందిన వారసులు కలిసి నటిస్తే చూడాలని కలలు కన్న వారికి దానిని నిజం చేసి చూపారు జక్కన్న. ఎన్టీఆర్ - రామ్‌చరణ్ హీరోలుగా నటించగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అజయ్ దేవ్‌గణ్, అలియా భట్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో దీనికి మరింత హైప్ వచ్చింది. శ్రీయా శరణ్, సముద్రఖని తదితరులు కీలకపాత్ర పోషించారు. మార్చి 24న రిలీజైన ఈ సినిమా సౌత్ , నార్త్ , ఓవర్సీస్ రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1,200 కోట్ల కలెక్షన్స్ సంపాదించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com