అప్పుడు దేవిశ్రీ .. ఇప్పుడు అనిరుధ్
Send us your feedback to audioarticles@vaarta.com
పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం అజ్ఞాతవాసి.. ఈ నెల 10న తెరపైకి రానున్న సంగతి తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ నటించిన ఈ సినిమాపై అభిమానుల్లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే అనిరుధ్ సంగీత సారథ్యంలో పాటలు హిట్ అవ్వడంతో.. ఆ అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా విడుదల చేసిన పవన్ పాట.. కొడకా కోటీశ్వర్రావా ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది.
ఈ హిట్ సాంగ్‌లో సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా తెరపై సందడి చేయనున్నారని తెలిసింది. గతంలో పవన్ అత్తారింటికి దారేది సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కూడా ఓ పాటలో సందడి చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అదే తరహాలో అనిరుధ్ కూడా ఈ పాటలో కనిపించనున్నాడని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ అతిథి పాత్రలో మెరవనున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments