అప్పుడు చిరంత‌న్ భ‌ట్‌.. ఇప్పుడు కీర‌వాణి..

  • IndiaGlitz, [Saturday,June 02 2018]

'గమ్యం' సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన క్రిష్ .. ఇప్ప‌టివ‌ర‌కు ఐదు సినిమాలు మాత్రమే చేసారు. క్రిష్ తొలి నాలుగు చిత్రాలను గమనిస్తే.. ఏ సినిమాకి కూడా అంత‌కుముందు చిత్రాల‌కు ప‌నిచేసిన సంగీత ద‌ర్శ‌కుడు రిపీట్ కాలేదు.

'గమ్యం' (ఇ.ఎస్.మూర్తి, ఆర్.అనిల్), 'వేదం' (ఎం.ఎం.కీరవాణి), 'కృష్ణం వందే జగద్గురుం' (మణిశర్మ), 'కంచె' (చిరంతన్ భట్) సినిమాల విష‌యంలో ఇది గ‌మ‌నించ‌వ‌చ్చు. అయితే కంచె స్వ‌ర‌క‌ర్త చిరంతన్ భట్‌కు 'గౌతమిపుత్ర శాతకర్ణి'తో రెండోసారి అవకాశం ఇచ్చారు. బాలకృష్ణ కెరీర్‌లో 100వ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా 2017 సంక్రాంతికి విడుద‌లై విజ‌యం సాధించింది.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు మరో సంగీత దర్శకుడితో కూడా రెండోసారి జట్టు కట్టనున్నారు క్రిష్. ఆ సంగీత ద‌ర్శ‌కుడే కీర‌వాణి. మహానటుడు ఎన్.టి.రామారావు బయోపిక్ 'య‌న్.టి.ఆర్' కోసం కీర‌వాణి స్వ‌రాలు అందించ‌నున్నారు. బాలకృష్ణ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతి కానుక‌గా తెర‌పైకి రానుంది.

క్రిష్‌తో రెండోసారి చిరంత‌న్ భ‌ట్ సినిమా చేసిన సంద‌ర్భంలోనూ.. ఇప్పుడు కీర‌వాణి రెండోసారి సినిమా చేస్తున్న సంద‌ర్భంలోనూ క‌థానాయ‌కుడు బాల‌కృష్ణ‌నే కావ‌డం విశేషం.

More News

రామ్ చరణ్, బోయపాటి సినిమాకి మ‌రో టైటిల్‌?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉత్త‌రాది భామ కియారా అద్వాని జంటగా యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

'సైరా నరసింహారెడ్డి' హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌

'బాహుబలి' సిరీస్‌తో తెలుగు సినిమా స్టామినా ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఇక ఈ సినిమాలో పనిచేసిన హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌ వలన ఈ సినిమా విజువల్‌గా మరింత అందంగా కనిపించింది.

ప్రతిష్టాత్మక "ఒట్టావా ఇండియన్ ఫిిలిం ఫెస్టివల్" కు ఎంపికైన 'వైఫ్ ఆఫ్ రామ్'

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా వైఫ్ ఆఫ్ రామ్. ఈ సినిమా ఈ నెలలోనే విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఓ అరుదైన గౌరవాన్ని అందుకుంది వైఫ్ ఆఫ్ రామ్.

జూన్ 5న గోపిచంద్ 'పంతం' టీజర్!

టాలీవుడ్‌ యాక్ష‌న్ హీరో గోపీచంద్ క‌థానాcయ‌కుడిగా నటిస్తోన్న చిత్రం ‘పంతం’. `ఫ‌ర్ ఎ కాస్‌` అనేది ఉప శీర్షిక‌. శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కె.కె. రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు.

అభిమానుల సమక్షంలో సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు వేడుక

సాహసాల సహవాసి.. తెలుగు సినీ ఖ్యాతికి చెరగని చిరునామా. పద్మభూషణ్‌, డా. సూపర్‌స్టార్‌ కృష్ణ. 'తేనె మనసులు'