నిన్న చిరు.. నేడు మ‌హేష్‌.. రేపు తార‌క్‌

  • IndiaGlitz, [Sunday,June 10 2018]

త‌మ కుటుంబ స‌భ్యుల ఆడియో వేడుక‌ల‌కి, ముంద‌స్తు విడుద‌ల వేడుక‌కు.. అదే కుటుంబానికి చెందిన స్టార్స్ రావ‌డం కొత్తేమీ కాదు. అయితే.. వ‌రుస‌గా మూడు రోజుల పాటు వేర్వేరు సినిమాల‌కు సంబంధించి వేడుక‌లు జ‌రగ‌డం.. వాటికి స్టార్ హీరోలు అతిథులుగా రావ‌డం అరుదైన విష‌య‌మే.

అలాంటి అరుదైన విష‌య‌మే ఇప్పుడు చోటుచేసుకుంటోంది. శ‌నివారం జ‌రిగిన తేజ్ ఐ ల‌వ్ యు ఆడియో ఫంక్ష‌న్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజ‌రై.. త‌న మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్‌ను ఆశీర్వ‌దించారు. ఇక ఆదివారం జ‌రుగుతున్న స‌మ్మోహ‌నం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో త‌న బావ సుధీర్ బాబు కోసం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సందడి చేయ‌నున్నారు.

అలాగే.. రేపు (సోమ‌వారం) జ‌ర‌గనున్న నా నువ్వే ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో త‌న అన్న‌య్య క‌ళ్యాణ్ రామ్ కోసం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ సంద‌డి చేయ‌బోతున్నారు. మొత్తానికి.. ఆయా కుటుంబ అభిమానుల‌కు ఇది ఆనందాన్నిచ్చే విష‌య‌మే