కరోనా వైరస్ నేపథ్యంలో నాగబాబు సరికొత్త వ్యాఖ్యలు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా వైరస్ లేదా కోవిడ్-19 పేరు వింటేనే ప్రపంచం వణికిపోతోంది.. చైనాలోని వూహాన్‌లో వచ్చిన ఈ వైరస్ ఖండాలను దాటేసి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలంగాణలో సైతం వచ్చేసింది. మరోవైపు ఢిల్లీలో కూడా ఈ వైరస్ ఒకరిద్దరికి సోకినట్లు వైద్యులు నిర్దారణకు వచ్చారు. ఇలాంటి వార్తలు విన్న జనాలు గజ గజ వణికిపోతున్నారు. ఇన్నాళ్లు ఈ వైరస్‌కు దూరంగా ఉన్న భారత్‌కు వచ్చేసింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడం తెలంగాణలో తీవ్ర కలకలం రేపుతోంది.
నిన్న చార్మీ.. నేడు నాగబాబు!
ఈ నేపథ్యంలో.. కరోనాకు వెల్‌కమ్ చెబుతూ నటి, నిర్మాత చార్మీ ఓ వీడియో చేసి నెట్టింట్లో పెట్టడంతో బూతుల వర్షం కురవడంతో.. తప్పయిపోయిందని క్షమించాలని ఆ తర్వాత మరో వీడియో చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా.. జనసేన నేత, సినీనటుడు నాగబాబు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం.. నెటిజన్ల నోళ్లలో నానుతున్నారు.
అసలేంటిది!?
ఈ భూమి మీద మనిషి అనే జీవి పూర్తిగా చస్తే ఈ భూమి, ప్రకృతి, వాతావరణం అద్భుతంగా ఉంటాయి. మిగిలిన జీవరాసులు చాలా చాలా సంతోషంగా జీవిస్తాయి. సర్వ జీవరాసులు ప్రకృతి ధర్మాలకు లోబడి బతుకుతున్నాయి.. కరోనా వైరస్ సహా... ఒక్క మనిషి తప్ప’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ‘ఆ మనుషుల్లో మీరు కూడా ఉన్నారు కదా?’ అంటూ నాగబాబుపై స్ట్రాంగ్ కౌంటర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే బూతుల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరు ఆయన్ను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆయనపై బూతుల వర్షం కురిపిస్తున్న వారిపై మెగాభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout