నిన్న బాలయ్య.. ఇవాళ ఏకంగా టీడీపీనే టార్గెట్ చేసిన నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు ఈ మధ్య అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. నిన్న, మొన్న నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఆయన.. ఇవాళ ఏకంగా తెలుగుదేశం పార్టీపైనా, ఆ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వైసీపీ తర్వాత ఎవరు అధికారంలోకి వస్తారు..? అన్న మాటలతో మొదలుపెట్టిన ఆయన.. వైసీపీతో సహా ఏ పార్టీ అయితే ఏపీలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ వుంది..? అనే విషయాలపై ఆయన వరుస ట్వీట్స్ చేశారు. ఇవాళ ఏపీ సీఎంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వరుస ట్వీట్ల వర్షం కురిపించిన ఆయన.. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా మళ్లీ వైసీపీ లేదా బీజేపీ లేదా జనసేన అధికారంలోకి వస్తుంది కానీ.. టీడీపీ మాత్రం రాదని చెప్పుకొచ్చారు.

టీడీపీ మాత్రం అస్సలు అధికారంలోకి రాదు..

‘ఒక్కటి మాత్రం నిజం అధికారంలోకి వచ్చిన వైసీపీ తరువాత.. మళ్లీ వైసీపీ పార్టీ వస్తుందో జనసేన పార్టీ వస్తుందో, బీజేపీ పార్టీ వస్తుందో కాలమే నిర్ణయించాలి. కానీ టీడీపీ మాత్రం రాదని నా నమ్మకం. ఎందుకంటే టీడీపీ హయాంలో ఏపీ ప్రజలకి ఊడబోడిచింది ఏమీలేదు. అభివృద్ధి అంతా టీవీల్లో పేపర్స్‌లో తప్ప నిజంగా చేసింది చాలా తక్కువ. అందుకే ఎలక్షన్స్‌లో చాలా ఘోరంగా ఓడిపోయిందన్న విషయం టీడీపీ వారు గుర్తించాలి. ఇక నెక్స్ట్ మేమే వస్తాం మాదే రాజ్యం లాంటి భ్రమలో నుంచి బయటపడాలి. లేదు మేము ఇలాంటి కలలోనే జీవిస్తామంటే వారిని స్వాగతించాల్సిందే. కాకపోతే మానసిక శాస్త్రంలో అలాంటి వాటిని లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు కనిపించడం- వినిపించడం అంటారు. ఆ భ్రమలకు ఆల్ ది బెస్ట్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ వరుస ట్వీట్స్‌పై నెటిజన్లు, అభిమానులు పెద్దఎత్తున స్పందిస్తుండగా.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More News

ఆ అకౌంట్‌కు.. నాకు ఎలాంటి సంబంధం లేదు : రావు రమేష్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కనివినీ ఎరుగని రీతిలో సీట్లు సంపాదించుకుని.. అఖండ విజయంతో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది.

రానా మ్యారేజ్‌ డేట్ ..!

సినీ ప‌రిశ్ర‌మ‌లో ద‌గ్గుబాటి వారికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. వీరి మూడోత‌రంగా సినీ రంగంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్నాడు రానా ద‌గ్గుబాటి.

ఎన్టీఆర్ త‌ర్వాత మ‌హేశ్ మాత్ర‌మే చేస్తున్నాడు!!

కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌తో ద‌ర్శ‌కులు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. కొత్త‌ద‌నంతో నిండిన క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు కూడా ఆద‌రిస్తున్నారు. అందుక‌నే స్టార్ హీరోలంద‌రూ వైవిధ్య‌మైన సినిమాలు

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి

దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి 3వ వర్ధంతి సందర్భంగా ఫిలింఛాంబర్ లో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన హీరో శ్రీకాంత్, నిర్మాత సి.కళ్యాణ్, దర్శక నిర్మాత తమ్మరెడ్డి భరద్వాజ, దర్శకులు రేలంగి

నన్ను ద్వేషించే వారికి ధ‌న్య‌వాదాలు: స‌మంత‌

అక్కినేని వారి కోడ‌లు స‌మంత అక్కినేని లాక్‌డౌన్ వ‌ల్ల ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్‌లోనే ఉంటూ వ‌చ్చారు.