అప్పుడు 'బాహుబలి'.. ఇప్పుడు 'సైరా'

  • IndiaGlitz, [Wednesday,June 06 2018]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది తమన్నా. ఈ సినిమాలో నర్తకిగా ఓ కీలక పాత్రలో నటిస్తోంది మిల్కీ బ్యూటీ. భరతనాట్యం నృత్యం ప్ర‌ద‌ర్శిస్తూ.. దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో హిందూ సంప్రదాయం గురించి చాటి చెబుతూనే.. బ్రిటీషు వారిని ఎదిరించే పాత్రలో కనిపించనుంది త‌మ‌న్నా. ఈ పాత్ర కోసం ప్ర‌త్యేక శిక్ష‌ణ కూడా తీసుకుంటోంది ఈ అమ్మ‌డు. ఇదిలా ఉంటే..

ఈ సినిమాలో త‌మ‌న్నా ఎంట్రీ ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఎందుకంటే.. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాలో తమన్నా నటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ షూటింగ్ జూలైలో ప్రారంభమైతే తమన్నా ఎంట్రీ ఏమో డిసెంబర్‌లో జరిగింది. ఇక ‘సైరా’ విషయానికొస్తే.. గత డిసెంబర్‌లో షూటింగ్ ప్రారంభించుకున్న ‘సైరా’ చిత్రం కోసం కూడా.. తమ‌న్నా ఏప్రిల్‌లో ఎంట్రీ ఇచ్చింది. తమ‌న్నా లేట్ ఎంట్రీ ఇచ్చిన ‘బాహుబలి’ ఆమె కెరీర్‌కు ప్ల‌స్ అయిన‌ట్లే.. ‘సైరా’ కూడా ప్ల‌స్ అవుతుందేమో చూడాలి.

More News

మెగాస్టార్ ముఖ్య అతిథిగా 'తేజ్‌ ఐ లవ్ యు' ఆడియో

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో

అప్పుడు శంక‌ర్‌.. ఇప్పుడు పా.రంజిత్‌

ఎంత ఎదిగినా ఒదిగి ఉండమంటారు పెద్దలు. ఈ లక్షణాన్ని అలాగే పుణికి పుచ్చుకున్న నటుడు రజనీ కాంత్.

ద‌స‌రా సంద‌డంతా సునీల్ దేనా?

‘నువ్వేకావాలి’తో కమెడియన్‌గా పరిచయమై.. తక్కువ వ్యవధిలోనే తెలుగులో టాప్ కమెడియన్‌గా ఎదిగారు సునీల్‌.

'చినబాబు'కి బాలు డ‌బ్బింగ్ చెప్పారా?

ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం.. పరిచయం అక్కరలేని పేరు. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని దాదాపు అన్ని భాషల్లోనూ పాట‌లు పాడి..

సూర్య‌.. రెండేళ్ళు బిజీ

'గ‌జిని' చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన త‌మిళ క‌థానాయ‌కుడు సూర్య‌.