అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు మహేష్ బాబు
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్.. ఇప్పటివరకు ఏడు సినిమాలకు దర్శకత్వం వహించారు. తాజాగా విడుదలైన 'రంగస్థలం' చిత్రం ఆయన ఏడో సినిమా. అతి త్వరలోనే తన ఎనిమిదో సినిమాని పట్టాలెక్కించనున్నారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఇదిలా ఉంటే.. తన కెరీర్లో బన్నీతో తప్ప మరే ఇతర హీరోతోనూ రెండోసారి కలిసి పని చేయలేదు సుకుమార్. తన తొలి చిత్రం 'ఆర్య' (2004) కోసం తొలిసారిగా బన్నీతో పనిచేసిన సుకుమార్.. ఆ సినిమా విడుదలైన 5 ఏళ్ళ తరువాత 'ఆర్య2' (2009) కోసం మరోసారి జట్టుకట్టారు.
కట్ చేస్తే.. దాదాపు పదేళ్ళ తరువాత మరో హీరో కాంబినేషన్లో రెండో సారి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ హీరో మరెవరో కాదు.. మహేష్ బాబు. 2014లో మహేష్ బాబు హీరోగా ‘1 నేనొక్కడినే’ సినిమాను తెరకెక్కించారు సుకుమార్. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కాలేదు. అయితే.. మహేష్‌తో హిట్ మూవీని తెరకెక్కించాలనే తన కోరికను బాహాటంగానే చాలా సార్లు తెలిపారు. ఇప్పుడు ఆ కోరిక తీరే దిశగా అడుగులు పడుతున్నాయి. తన తదుపరి సినిమాని మహేష్‌తో చేయబోతున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఐదేళ్ళ తరువాత తెరపైకి రానున్న ఈ సినిమాతోనైనా ఈ కాంబినేషన్ హిట్ కొడుతుందేమో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments