చాలా గ్యాప్ తర్వాత తెలుగులో....
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సోనూసూద్ దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. విలక్షణమైన విలనిజంతో మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయబోతున్నాడు. వివరాల్లోకెళ్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విలన్‌గా సోనూసూద్ నటిస్తున్నారు. అది కూడా రాజకీయ నాయకుడి పాత్రలో. `తేజ కథను నెరేట్ చేసిన తర్వాత వద్దు అనడానికి నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేయని ఓ డిఫరెంట్ పాత్రలో కనపడతాను` అన్నారు సోనూసూద్. మణికర్ణిక సినిమా నుండి అర్ధాంతరంగా తప్పుకున్న ఈయన బాలీవుడ్ పి.వి.సింధు బయోపిక్‌లో కూడా నటించబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Diya Harini
Contact at support@indiaglitz.com