పాతికేళ్ల తర్వాత...
Send us your feedback to audioarticles@vaarta.com
దాదాపు పాతికేళ్ళ తర్వాత సంజయ్‌దత్, శ్రీదేవి మరోసారి జత కట్టనున్నారు. 1993లో వచ్చిన 'గుమ్రా' అనే చిత్రంలో సంజయ్‌దత్, శ్రీదేవి కలిసి నటించారు. ఇప్పుడు కరణ్‌జోహార్, సాజిద్ నదియాద్వాలా కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో మళ్లీ కలిసి నటించబోతున్నారు. ఈ ఇద్దరితో పాటు వరుణ్‌ధావన్, అలియా భట్, సోనాక్షిసిన్హా తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తారట.
ఇటీవల నటిగా యాబై వసంతాలను పూర్తి చేసుకున్న శ్రీదేవి 'మామ్' చిత్రంలో నటించారు. త్వరలోనే తన తదుపరి సినిమాకు రెడీ అవుతున్నారు. మరో వైపు సంజయ్ దత్ 'భూమి' అనే సినిమాలో నటిస్తున్నారు. సంజయ్‌దత్ ఇప్పుడు చేస్తున్న సినిమాను పూర్తి చేసుకోగానే శ్రీదేవితో చేయబోయే సినిమా కోసం సన్నద్ధమవుతారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com