1971 తర్వాత ఫస్ట్ టైం ఇలా సర్జికల్ స్ట్రైక్స్-2.0
Send us your feedback to audioarticles@vaarta.com
కుక్క తోక వంకర అన్న సామెతను ఇప్పటికే పలుమార్లు అక్షరాలా నిజం చేసిన పాక్‌కు మంగళవారం తెల్లవారుజామున ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దిమ్మదిరిగి బొమ్మకనపడేలా షాకిచ్చిన సంగతి తెలిసిందే. బహుశా ఈ దెబ్బకు ఇక కొన్నేళ్లు గడిచినా కోలుకోవడం కష్టమేనని.. అసలు ఈ దెబ్బతో కోలుకునే పరిస్థితే లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు మన జవాన్లు 40మంది వీరమరణం పొందితే.. అందుకు స్ట్రాంగ్ రివెంజ్ తీర్చుకున్న వడ్డీకి చక్రవడ్డీ.. భూ చక్రవడ్డీగా సుమారు 400 మంది జైష్-ఏ-మహ్మద్ ఉగ్రమూకలున్న స్థావరాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ 2000 మిరాజ్‌కు 2,336 కిలోమీటర్ల వేగంతో, 17 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే శక్తి సామర్థ్యాలున్నాయి.
అయితే ఈ రేంజ్లో 1971 తర్వాత ఇలా దాడి చేయడం ఇదే తొలిసారి. ముఖ్యంగా 1971 తర్వాత ఇన్నేళ్ల వరకూ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ (పీవోకే) దాటిపోలేదు. 1999లో కార్గిల్ వార్ జరుగుతున్న సమయంలోనూ లోపలికి పోకుండా సరిహద్దుల్లో నుంచే యద్ధం చేయడం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలతో ఏకంగా పాక్ బార్డర్ దాటేసి బాలకోట్, చికోటి, ముజఫరాబాద్ ఇలా మూడు ప్రాంతాల్లో మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రైక్స్)చేసింది. 3.30 గంటలకు జరిగిన ఈ దాడిలో జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ శిక్షణా క్యాంపులపై దాడులు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే భారత్ సరిహద్దు దాటి దాడి చేయలేదు.. గనుక ఇది పాకిస్తాన్‌పై దాడి చేసినట్లేనని చెప్పుకోవచ్చు. బహుశా భారత్ ఈ రేంజ్లో రివెంజ్ తీర్చుకుంటుందని ఉగ్రమూకలుగానీ పాక్ గానీ కలలో కూడా ఊహించి ఉండదేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout