close
Choose your channels

16 ఏళ్ల తర్వాత...

Friday, January 11, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

16 ఏళ్ల తర్వాత...

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్‌రాజ్, సౌందర్య, జగపతిబాబు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'అంతఃపురం'. ఈ చిత్రాన్ని నానా పటేకర్ ప్రధాన పాత్రధారిగా హిందీలో కూడా కృష్ణవంశీ రీమేక్ చేశారు. ఇప్పుడు మళ్లీ 16 ఏళ్లకు నానా పటేకర్‌తో ఈ దర్శకుడు సినిమా చేయబోతున్నారు.

అది కూడా హిందీ వెర్షన్‌లో.. ఇదే సినిమాను తెలుగులో ప్రకాశ్‌రాజ్‌తో కృష్ణవంశీ తెరకెక్కించబోతున్నారు. ఇంత‌కు ఆ సినిమా ఏదో కాదు.. మ‌రాఠా చిత్రం 'న‌ట‌సామ్రాట్‌' ను తెలుగులో రీమేక్ చేయాల‌నుకుంటున్నారు.

చాలా కాలంగా మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న ఈ దర్శకుడు ఈసారి ఏకంగా రెండు సినిమాలను చేయబోతున్నారని సినీ వర్గాల సమాచారం. త్వరలోనే ఆ సినిమా వివరాలు వెల్లడి కానున్నాయి. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.