14 ఏళ్ల తర్వాత..
- IndiaGlitz, [Saturday,December 08 2018]
లెజండరీ దర్శకుడు కె. రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాష్ మరలా మేకప్ వేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దాదపు 14 ఏళ్ల తర్వాత ఆయన యాక్టింగ్ లోకి దిగుతున్నారు. 'నీతో', 'మార్నింగ్ రాగా' చిత్రాల్లో ఆయన నటించిన విషయం తెలిసిందే.
దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరలా నటించనున్నారు. అదీ ఆయన తండ్రి పాత్రలో. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'యన్.టి.ఆర్' బయోపిక్‌లో తండ్రి కె.రాఘవేంద్రరావు పాత్రను కోవెలమూడి ప్రకాష్ పోషించనున్నారు.
యన్.టి.ఆర్ - రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన కమర్షియల్ హిట్స్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యన్.టి.ఆర్. జీవితంలో రాఘవేంద్రరావుకు ఉన్న ప్రముఖ స్థానం అది. ఈ పాత్రకు ఎవరైతే బావుంటుందా అని క్రిష్ పలువురి పేర్లను అనుకున్నారట. అయితే ఇప్పుడు ఆ అవకాశం ప్రకాష్‌కే అందింది.