Nithin:12 ఏళ్ల తర్వాత హిట్ కాంబోలో నితిన్ సినిమా.. ఈసారి భారీగా ప్లాన్..
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. చివరగా నాలుగేళ్ల క్రితం వచ్చిన 'భీష్మ' సినిమాతో హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి అతడు చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. మాచర్ల నియోజకవర్గం, మ్యాస్ట్రో, రంగ్‌దే, ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చి కెరీర్‌కు ఊపు తెచ్చిన దర్శకుడితో మళ్లీ సినిమా చేసేందుకు మొగ్గుచూపుతున్నాడట.
'సై' సినిమా తర్వాత సరైన హిట్ లేక కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో 'ఇష్క్' మూవీతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కూడా హిట్ కావడంతో నితిన్ కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఇప్పుడు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ యువ హీరో మళ్లీ తనకు హిట్ ఇచ్చిన విక్రమ్ దర్శకత్వంలో మూవీ చూసేందుకు సిద్ధమయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాను 'హనుమాన్' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారట.
విక్రమ్ ఇటీవలే నాగచైతన్యతో ‘దూత’ వంటి వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు ఆ సిరీస్ సెకండ్ సీజన్‌ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నితిన్‌తో సినిమా తీస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. ఇష్క్ లాంటి లవ్ స్టోరీ తీస్తాడా..? లేక తనదైన డిఫరెంట్ జోనర్‌తో తీస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.
ఇక నితిన్ ప్రస్తుతం తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది. అలాగే వకీల్ సాబ్ దర్శకుడు వేణుశ్రీరాంతో ‘తమ్ముడు’ సినిమాలోనూ హీరోగా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాల తర్వాతే విక్రమ్ సినిమా ఉండనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com