Nithin:12 ఏళ్ల తర్వాత హిట్ కాంబోలో నితిన్ సినిమా.. ఈసారి భారీగా ప్లాన్..

  • IndiaGlitz, [Monday,March 18 2024]

యువ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. చివరగా నాలుగేళ్ల క్రితం వచ్చిన 'భీష్మ' సినిమాతో హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి అతడు చేసిన సినిమాలన్ని ఫ్లాప్ అయ్యాయి. మాచర్ల నియోజకవర్గం, మ్యాస్ట్రో, రంగ్‌దే, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే గతంలో తనకు సూపర్ హిట్ ఇచ్చి కెరీర్‌కు ఊపు తెచ్చిన దర్శకుడితో మళ్లీ సినిమా చేసేందుకు మొగ్గుచూపుతున్నాడట.

'సై' సినిమా తర్వాత సరైన హిట్ లేక కెరీర్ అయిపోయిందనుకున్న తరుణంలో 'ఇష్క్' మూవీతో స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన కొన్ని సినిమాలు కూడా హిట్ కావడంతో నితిన్ కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఇప్పుడు కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ యువ హీరో మళ్లీ తనకు హిట్ ఇచ్చిన విక్రమ్ దర్శకత్వంలో మూవీ చూసేందుకు సిద్ధమయ్యాడని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాను 'హనుమాన్' లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారట.

విక్రమ్ ఇటీవలే నాగచైతన్యతో ‘దూత’ వంటి వెబ్ సిరీస్‌తో సూపర్ హిట్‌ని అందుకున్నాడు. ఇప్పుడు ఆ సిరీస్ సెకండ్ సీజన్‌ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నితిన్‌తో సినిమా తీస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే.. ఇష్క్‌ లాంటి లవ్ స్టోరీ తీస్తాడా..? లేక తనదైన డిఫరెంట్ జోనర్‌తో తీస్తాడా..? అనేది తెలియాల్సి ఉంది.

ఇక నితిన్ ప్రస్తుతం తనకు 'భీష్మ' వంటి హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకుంది. అలాగే వకీల్ సాబ్ దర్శకుడు వేణుశ్రీరాంతో ‘తమ్ముడు’ సినిమాలోనూ హీరోగా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ చిత్రాల తర్వాతే విక్రమ్ సినిమా ఉండనుంది.

More News

Mudragada: సినిమాల్లో పవన్ హీరోమో..రాజకీయాల్లో నేనే హీరో.. పవన్‌పై ముద్రగడ సెటైర్లు..

ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన పార్టీ క్లోజ్ అవ్వడం ఖాయమని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో చేరిన మరుసటిరోజే పవన్ కల్యాణ్‌ టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు.

Kejriwal: లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది.

Dhanam Nagender:దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలి.. స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు..

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదుచేశారు.

Modi:కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. నిజామాబాద్ జిల్లా జగిత్యాల విజయసంకల్ప సభలో ఆయన ప్రసంగించారు.

Prajagalam:కూటమి 'ప్రజాగళం' సభ అట్టర్ ఫ్లాప్.. వైసీపీ నేతల విమర్శలు..

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి చిలలూరిపేటలో నిర్వహించిన ప్రజాగళం సభపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.