'లవ్ స్టోరి' మూవీ నుండి ‘ ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ రిలీజ్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంట గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘‘లవ్ స్టోరీ’’. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే స్పెషల్ గా విడుదల చేసిన ‘ఏయ్ పిల్లా’ మ్యూజికల్ ప్రివ్యూ (1 మినిట్ వీడియో సాంగ్) కు మంచి రెస్సాన్స్ వస్తుంది. ఫస్ట్ కిస్ ఫీలింగ్ ని నాగచైతన్య పలకించిన నటన మంచి రెస్సాన్స్ వస్తుంది. ఇక ‘ఏం దబ్బా.. ముద్దు పెడితే ఏడుస్తారబ్బా’ సాయి పల్లవి డైలాగ్ ఈ వాలంటైన్స్ డే కి మెమరబుల్ గా మిగులుతుంది.
సెన్సిబుల్ లవ్ స్టోరీస్ ని బలంగా ప్రజెంట్ చేయడంలో మాస్టర్ అయిన శేఖర్ కమ్ముల తెరమీద కురిపించబోతున్న ఈ ప్రేమ లో తడిచేందుకు ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేసింది ఈ సాంగ్ . రెహామాన్ స్కూల్ నుండి వచ్చిన పవన్ స్వరాలు ఈ ప్రేమకథను మరింత హృద్యంగా మార్చబోతున్నాయి. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ఈ అందమైన ప్రేమకథ అక్కినేని అభిమనుల్లో, ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించింది. ఈ ప్రేమకథ సమ్మర్ కి స్సెషల్ ఎట్రాక్షన్ గా మారబోతుంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ‘లవ్ స్టోరీ’సమ్మర్ లో విడుదలకు సిద్దం అవుతుంది.
నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీలో రాజీవ్ కనకాల,ఈశ్వరీ రావు,దేవయాని ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com