'మేజర్' కోసం శేష్ వర్కవుట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
`మేజర్` చిత్రం కోసం అడివి శేష్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో ప్రధానమైనది బరువు తగ్గడం. ఆయన ఈ చిత్రం కోసం దాదాపు 10 కిలోలు బరువు తగ్గే పనిలో ఉన్నారు. దానికోసం వర్కవుట్లు చేయడంతో పాటు, డైట్ కూడా ఫాలో అవుతున్నారు. దీని గురించి అడివి శేష్ మాట్లాడుతూ ``మేజర్ చిత్రంలో నేను పోషించనున్న సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర చాలా లైవ్లీగా ఉంటుంది. చిన్నప్పటి నుంచీ నాకు నిజ జీవిత పాత్రల్లో నటించాలనే కోరిక ఉండేది. అందులోనూ తొలి చిత్రం ఒక ఆఫీసర్‌ది కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన పాత్రలో జీవించాలంటే ఆయనలాగా నేను చాలా ఫిట్‌గా ఉండాలి. అందుకే ఇంకాస్త తగ్గి, ఇంకాస్త ఫిట్‌గా ఈ సినిమా చేయాలనుకుంటున్నాను. దీని కోసం డైట్ కూడా ఫాలో అవుతున్నాను. ఇంకో మూడు నెలల్లో కచ్చితంగా పర్ఫెక్ట్ గా తయారవుతాను.
26/11 ఘటనల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో మందిని కాపాడిన మేజర్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి పాత్రను సినిమాగా చేస్తున్నప్పుడు మేం కథాపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. నిజానికి ఆయన జీవితంలో ఎన్నో సాహసోపేతమైన కార్యాలున్నాయి. వాటన్నిటిని మేం యథాతథంగా తెరపై చూపించినప్పటికీ చాలా మంది నమ్మరు. మేం ఏదో సినిమాకోసం కేరక్టర్‌ను హైలైట్ చేయడం కోసం ఆయన పాత్రను పెంచి రాసుకున్నామని భావిస్తారు. కానీ అంతకు మించిన సాహసాలు చేసిన ఘనత సందీప్గారిది. ఆయన పేరుమీద నేను రెండున్నర గంట తెరపై జీవిస్తాననుకుంటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి`` అని అన్నారు. ఈ సినిమా నిర్మాత అయిన మహేష్ గురించి మాట్లాడుతూ ``నేను మహేష్‌కి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆయన నిర్మిస్తున్న చిత్రంలో నేను సినిమా చేయడం చాలా గర్వంగా ఉంది. తప్పకుండా మా కాంబినేషన్లో వచ్చే సినిమా దేశపౌరులందరూ గర్వపడేలా ఉంటుంది`` అని అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout