గూఢచారి చిత్రానికి అందరి ప్రశంసలు లభించడం చాలా హ్యాపీగా ఉంది - అడివి శేష్
Send us your feedback to audioarticles@vaarta.com
'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గుడాచారి'.శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూడాచారి చిత్రాన్ని నిర్మించారు.
టేకింగ్, మేకింగ్ పరంగా హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రములో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్, మధు షాలిని ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అనీల్ సుంకర అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసారు. ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఆగష్టు ౩న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ అయింది. భారీ ఓపెనింగ్స్ తో రిలీజ్ అయిన ఈ చిత్రం అన్నీ ఏరియాలనుండి యునానిమస్ హిట్ టాక్ తో రన్ అవుతోంది.
ఈ సందర్భంగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో హీరో అడివి శేషు, హీరోయిన్ శోభిత, దర్శకుడు శశికిరణ్, మాటల రచయిత అబ్బూరి రవి, కెమెరామెన్ శనియేల్ డియో, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర, లైన్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల పాల్గొన్నారు.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ- "సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దెగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటున్నారు. ఇది నా ఫైవ్ ఇయర్స్ కృషి. రేటింగ్స్ అందంగా, అమేజింగ్ రివ్యూస్ ఇచ్చారు.బుక్ మై షో యాప్ లో కూడా 96% పర్సెంట్ టికెట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఫుల్స్ అయ్యాయి. వైజాగ్ లో చిన్నప్పుడు నేను త్రీ ఇయర్స్ వున్నాను.ఆ టైంలో జగదాంబ థియేటర్ లో అన్నీ సినిమాలు చూసేవాడ్ని.
అలాంటిది ఇప్పుడు నా సినిమా అదే థియేటర్లో హౌస్ ఫుల్ అవడం బిగ్ అచీవమెంట్ గా భావిస్తున్నాను. శశి ఫెంటాస్టిక్ గా ఈ సినిమా తీసాడు. శ్రీ చరణ్ మ్యూజిక్, కెమెరా వర్క్ కి చాలా పేరు వచ్చింది.అబ్బూరి రవి నాకోసం పంజా చిత్రం లో మంచి క్యారెక్టర్, డైలాగ్స్ రాసారు.అలాగే క్షణం లో కూడా మంచి డైలాగ్స్ ఇచ్చారు.ఈ రెండు చిత్రాలు నా కెరీర్ ఎదుగుదలకి చాలా హెల్ప్ అయ్యాయి.ఇప్పుడు గూఢచారి కి ఎక్స్ లెంట్ డైలాగ్స్ రాసారు.ఈ మూడు చిత్రాలు నాకు చాలా మంచి పేరు తెచ్చాయి" అన్నారు.
హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మాట్లాడుతూ- "గూఢచారి లాంటి ఒక మంచి చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం కావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రం మంచి ఎక్స్ పీరియెన్స్ ఇచ్చింది. టు ఇయర్స్ బాక్ శేషు ఈ కథని రెడీ చేసుకున్నాడు. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. థియేటర్లో కూర్చుని ఆడియెన్స్ మధ్య ఈ ఫిల్మ్ చూడటం కొత్త ఎక్స్ పీరియెన్స్ కలిగింది. ఈ చిత్రం లో నటిచినందుకు హానర్ గా భావిస్తున్నాను "అన్నారు.
దర్శకుడు శశికిరన్ తిక్క మాట్లాడుతూ- "టీమ్ అందరం కూర్చొని చిన్న చిన్న విషయాలను కూడా డీటైల్ గా చర్చించి వర్క్ చేసాం. శ్రీ చరణ్ మ్యూజిక్, శానియల్ కెమెరా విజువల్స్ ఔట్ స్టాండింగ్ గా ఇచ్చారు. అందరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ కి న థాంక్స్" అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీ చరణ్ మాట్లాడుతూ- "మ్యూజిక్ డైరెక్టర్ గా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది శేషు. అక్కడ నుండి ఈ టు ఇయర్స్ లో ట్వంటీ మూవీస్ చేసాను. అన్నీ మ్యూజికల్ గా మంచి పేరు తెచ్చాయి. ఈ చిత్రానికి బాక్ గ్రౌండ్ స్కోర్ చాలా టైం తీసుకొని చేసాం. మ్యూజిక్ చాలా బాగుంది అని ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ అవకడం ఇచ్చిన నిర్మాతలకు, శేషుకి నా థాంక్స్ "అన్నారు.
స్పెషల్ క్యారెక్టర్లో నటించిన మధు షాలిని మాట్లాడుతూ- "అందరూ తెలుగు సినిమాల్లో నటీచడం లేదు అని అడుగుతున్నారు. మంచి క్యారెక్టర్స్ వస్తే తప్ప చేయడం లేదు. ఈ చిత్రం లో చిన్న పాత్ర అయిన కూడా యాక్టింగ్ కి స్కోప్ ఉంది. రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ అవకాశం ఇచ్చిన టీమ్ అందరికీ నా థాంక్స్" అన్నారు.
మాటల రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ- "ప్రతి ఒక్కరూ ఈ చిత్రానికి సిన్సియర్ గా హార్డ్ వర్క్ చేసి చేశారు. శేషు, డైరెక్టర్ శశి ఎంతో ఒపికగా డిస్స్కస్ చేసుకొని పనిచేసారు. వాళ్ళ ద్వారా నేను ఎంతో నేర్చుకున్నాను.నిర్మాతలు పిల్లర్లుగా ఉండి మంచి సినిమా చేయడానికి సపోర్ట్ చేశారు. ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇచ్చారు " అన్నారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర మాట్లాడుతూ- "ఈ సినిమా టీజర్ నుండి రిలీజ్ వరకు మీడియా ఎంతో సపోర్ట్ చేసింది. వారికి నా థాంక్స్. మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్ లో 80% ఫుల్స్ అవడం రికార్డ్. నెక్స్ట్ లెవల్ కి ఈ మూవీ రీచ్ అవుతుంది. ఒక చిన్న సినిమాని బిలీవ్ చేయడం బిగ్గెస్ట్ అచీవమెంట్. ఇలాంటి ఒక మంచి చిత్రాన్ని మా బ్యానర్ ద్వారా రిలీజ్ చేయడం ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ పెంటాస్టిక్ గా వర్క్ చేశారు. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ "అన్నారు.
నిర్మాత అభిషేక్ నామ మాట్లాడుతూ- "గూఢచారి సినిమాకి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. యుననిమస్ గా హిట్ టాక్ వచ్చింది. ఏ నిర్మాతకైనా సక్సెస్ వచ్చినప్పుడు కలిగే ఆనందం వేరెలా వుంటుంది. మా ఆనందం మాటల్లో చెప్పలేం. ఈ సినిమా సక్సెస్ అవడం అప్పుడే శేషు కి బాలీవుడ్ నుండి ఆపర్లు వస్తున్నాయి. ఈ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడి వర్క్ చేశారు. ఇదే సేమ్ టీమ్ తో మళ్ళీ గుఢచారి 2 ఫిల్మ్ చెయ్యాలని ప్లాన్ చెయ్యాలి. శేషు స్క్రిప్ట్ రెడీ చేయగానే ఇమీడియట్ గా సినిమా స్టార్ట్ చేస్తాం" అన్నారు.
లైన్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ- "మా టీమ్ అందరూ డే అండ్ నైట్ కష్టపడి సొంత సినిమాలా బావించి వర్క్ చేశారు. వారందరికీ నా థాంక్స్. సినిమా సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ "అన్నారు.
అనంతరం చిత్ర యూనిట్ భారీ కేక్ ని కట్ చేసి సక్సెస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments