అడవి శేష్ ‘మేజర్’ టీజర్ అదిరిపోయింది..
Send us your feedback to audioarticles@vaarta.com
‘గూఢచారి’,‘ఎవరు’ చిత్రాల తర్వాత హీరోగా అడవి శేష్‌కి ఒక మంచి గుర్తింపు వచ్చింది. నాలుగు ఫైట్లు, నాలుగు డ్యూయెట్లు వంటి రొటీన్ రొమాంటిక్ మూవీస్‌కి స్వస్తి పలికి.. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులు తన చిత్రాల కోసం ఎదురు చూసేలా చేసుకున్నాడు. ఇప్పుడు అడవి శేష్ మూవీ వస్తోందంటేనే ప్రేక్షకుల్లో ఓ ఆసక్తి ఏర్పడింది. మెదడుకు పదును పెట్టే చిత్రాలతో సస్పెన్స్ థ్రిల్లర్‌ను ఎంచుకుంటూ ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు కూర్చీలకు అతుక్కుపోయేలా అడవి శేష్ చేస్తున్నాడనడంలో సందేహం లేదు. ఆయన సినిమాల్లో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన సినిమా ‘గూఢచారి’. ప్రస్తుతం ఆ తరహాలోనే మరో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అడవి శేష్ సిద్ధమవుతున్నాడు.
శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా వస్తున్న సినిమా ‘మేజర్’. శోభితా ధూళిపాళ్ల, సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముంబై 26/11 ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఉగాది కానుకగా.. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజైంది. తెలుగులో మహేశ్‌బాబు, హిందీలో సల్మాన్‌ఖాన్, మలయాళం వర్షన్‌ను పృథ్వీరాజ్ రిలీజ్ చేశారు. అగ్నికీలల్లో చిక్కుకుపోయిన హోటల్లో అమాయకులను కాపాడేందుకొచ్చిన వీరుడిలా అడివి శేష్ కనిపిస్తున్న సీన్‌తో టీజర్ మొదలవుతుంది.
'బార్డర్లో ఆర్మీలా ఫైట్ చేయాలి, ఇండియా క్రికెట్ మ్యాచ్ అయినా గెలవాలి.. అందరూ ఇదే ఆలోచిస్తారు. అదీ దేశభక్తే. దేశాన్ని ప్రేమించడం అందరి పని, వాళ్లను కాపాడటం సోల్జర్ పని' అంటూ అడవిశేష్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌ను మరో మెట్టు ఎక్కించింది. ఈ టీజర్ రిలీజైన కొద్ది సేపట్లోనే సెలబ్రెటీలు, నెటిజన్లు దీనిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మొత్తమ్మీద ఈ టీజర్ అదరగొట్టేస్తోంది. అడవి శేష్ ఖాతాలో మరో హిట్ ఖాయంగా కనిపిస్తోంది. మరో విశేషం ఏంటంటే ఈ చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘మేజర్’ ఈ ఏడాది జూలై 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout