అడవి శేష్ 'మేజర్ ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Wednesday,November 03 2021]

తెలుగు సినీ ఇండస్ట్రీలో అడివి శేష్‌ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి కథానాయకుల్లా కాకుండా తనకు నచ్చిన జానర్‌లో సినిమాలను తీస్తూ.. మంచి సక్సెస్‌లు సాధిస్తున్నాడు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కినవే. 'క్షణం', 'గూఢచారి' ‘ఎవరు’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ హీరో సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ‘మేజర్‌’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 26/11 ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్‌ శశికిరణ్‌ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా మేజర్ సినిమా నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ‘‘ మేజర్ ’’ సినిమాను థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. దీనిని సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో మేజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మురళి శర్మ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.

More News

“శాకిని- ఢాకిని” గా నివేదా రెజీనా… త్వరలోనే ప్రేక్షకుల ముందుకు..!!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్‌ సినిమాలో తన ఫెర్ఫామెన్స్‏తో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది నివేదా థామస్‌.

పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్లబోతున్న "భగత్ సింగ్ నగర్" చిత్రం 

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో

త్రివిక్రమ్ గారు లా రాశానంటే గౌరవంగా భావిస్తా - మాటల రచయిత గణేష్ రావూరి

టాలీవుడ్ రీసెంట్ సూపర్ హిట్ వరుడు కావలెను. నాగశౌర్య, రీతు వర్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై

బిగ్‌బాస్ 5 తెలుగు: సన్నీ-సిరిల మధ్య రగడ, షన్నూ తప్పించి.. హౌస్‌మేట్స్‌ మొత్తం నామినేషన్స్‌లోకి

బిగ్‌బాస్ 5 తెలుగులో సోమవారం ఎపిసోడ్ హాట్‌హాట్‌గా సాగింది. నామినేషన్స్ డే కావడంతో కంటెస్టెంట్స్ మధ్య వాదనలు, విమర్శలు, గొడవలు జరిగాయి.

బద్వేల్‌లో వైసీపీ ఘన విజయం.. భారీ మెజార్టీ, కనుచూపు మేరలో కనిపించని విపక్షాలు

అనుకున్నదే జరిగింది.. బద్వేల్ ఉపఎన్నికలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది.