అడవి శేష్ 'మేజర్ ' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినీ ఇండస్ట్రీలో అడివి శేష్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరి కథానాయకుల్లా కాకుండా తనకు నచ్చిన జానర్లో సినిమాలను తీస్తూ.. మంచి సక్సెస్‌లు సాధిస్తున్నాడు. ఆయన నటించిన దాదాపు అన్ని సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కినవే. 'క్షణం', 'గూఢచారి' ‘ఎవరు’ సినిమాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ యువ హీరో సరికొత్త పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ‘మేజర్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 26/11 ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను డైరెక్టర్ శశికిరణ్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో ఈ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా మేజర్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న ‘‘ మేజర్ ’’ సినిమాను థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. దీనిని సోనీ పిక్చర్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, ఏ+ఎస్ మూవీస్ నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో మేజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మురళి శర్మ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com