తుదిద‌శ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న అడివి శేష్‌ ‘మేజర్‌’

  • IndiaGlitz, [Thursday,August 12 2021]

అడివి శేష్‌ హీరోగా నటిస్తున్నమేజ‌ర్ సినిమా చివ‌రి షెడ్యూల్‌ షూటింగ్ ఈ రోజు (ఆగ‌స్ట్‌12)ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌.

ఇటీవల విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించ‌డంతో పాటు టీజర్‌ చూసిన ప్రతి ఒక్కరు యూనిట్‌ను ప్రశంసించారు. భారీ అంఛ‌నాల‌తో రూపొందుతున్న మేజ‌ర్ ఫైన‌ల్ షెడ్యూల్ షూటింగ్ లో హీరో అడివిశేష్‌, సాయి ముంజ్రేక‌ర్ పాల్గొంటారు. ఆగ‌స్ట్ చివ‌రిక‌ల్లా ఈ మూవీ షూటింగ్ పూర్త‌వ‌నుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ విడుద‌ల‌చేసిన అడివిశేష్ స్టిల్ ఆక‌ట్టుకుంటుంది.

అడివిశేష్ మాట్లాడుతూ - మేజ‌ర్ సినిమా నా ప్యాష‌న్ ప్రాజెక్ట్‌. కొన్నాళ్ల క్రితం వార్తల్లో ఆ విషాద సంఘటనను చూసిన‌ప్ప‌టి నుండి ఈ చిత్రంతో నా ప్రయాణం మొదలైంది. ఇప్పుడు చిత్రీక‌ర‌ణ చివ‌రిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం నేను మిశ్రమ భావోద్వేగాలతో మునిగిపోయాను. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వంటి ధైర్య‌వంతుడి పాత్ర‌ను నాకిచ్చినందుకు వారి త‌ల్లితండ్రుల‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆ అమరవీరుడి స్ఫూర్తిదాయకమైన జీవితానికి నివాళి అర్పించడంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను'' అన్నారు.

నవంబరు 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించిన అమరవీరుడు సందీప్‌ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ద‌ర్శ‌కుడు.

అడివి శేష్, సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్‌రాజ్, రేవతి మురళి శర్మ ప్రధాన తారాగణం మ‌హేష్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న మేజ‌ర్ చిత్రం హిందీ, తెలుగు, మ‌ల‌యాళం భాష‌ల్లో ఈ ఏడాదిలోనే విడుద‌ల‌కానుంది.

More News

'రాజ రాజ చోర‌' .. ఆగ‌స్ట్ 19న విడుద‌ల‌

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ `రాజ రాజ చోర‌`. ఈ సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రాజశేఖర్ నటిస్తున్న 'శేఖర్' షూటింగ్ అరకు లో మళ్లీ షురూ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా 'శేఖర్'. 'మ్యాన్ విత్ ద స్కార్' అనేది ఉపశీర్షిక.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త చిత్రం ఇదే

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. యాక్ష‌న్ సినిమాల‌ను చేయ‌డానికి చాలా ఆస‌క్తిని చూపుతుంటారు.

‘పాగల్’ ప్రేమను గురించి చెప్పే సినిమా - విష్వ‌క్ సేన్‌

విష్వ‌క్‌సేన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం `పాగ‌ల్‌`.

'సైకో వర్మ - వీడు తేడా' మోషన్ పోస్టర్ విడుదల

'సైకో వర్మ' (వీడు తేడా) చిత్రం మోషన్ పోస్టర్ ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైంది. విడుదలైన కొద్ది గంటల్లోనే దీనికి విశేషమైన స్పందన లభించింది.