అడివి శేష్ 'మేజర్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'హృదయమా..' జనవరి 7న విడుదల

  • IndiaGlitz, [Wednesday,January 05 2022]

ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా 'మేజర్'. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న‌ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాష‌ల‌లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాభవుతోంది. ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 'మేజర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమా ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు.

శ్రీచరణ్ పాకాల 'మేజర్' చిత్రానికి అద్భఉతమైన సంగీతాన్ని అందించారు. 'మేజర్' మ్యూజిక్ మ్యాజిక్ హృదయమా పాటతో మొదలు కానుంది. ఈ పాటకు వీఎన్ వీ రమేష్, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా..సిధ్ శ్రీరామ్ ఆలపించారు. హృదయమా అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటపై చిత్రీకరించిన రొమాంటిక్ గా పాటగా పిక్చరైజ్ చేశారు.

ఇటీవలే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ ప్రారంభించారు హీరో అడివి శేష్. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్ తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో 'మేజర్' సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన 'మేజర్' టీజ‌ర్‌కి విశేష‌మైన స్పంద‌న వ‌చ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా 'మేజర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది.

మహేష్ బాబు యొక్క GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్.

More News

‘స్పిరిట్' లో ప్రభాస్ రోల్ ఇదే.. అదే నిజమైతే అభిమానులకు పూనకాలే

బాహుబలి సిరీస్ కోసం దాదాపు ఐదేళ్ల పాటు అభిమానుల దూరమైన ప్రభాస్.. ఆ తర్వాతి నుంచి సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు.

స్పేస్ వదిలిన ఆర్ఆర్ఆర్.. చిన్న సినిమాల జోరు, తెలుగు బాక్సాఫీస్‌పై విశాల్- అజిత్ దండయాత్ర

తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్.

క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడికి ఏడాది: జనవరి 6న జాతినుద్దేశించి ప్రసంగించనున్న బైడెన్, ట్రంప్

అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిపోయిన క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు అప్పుడే ఏడాది కావొస్తోంది.

మీకు అధికారమిచ్చింది, మా నెత్తిన కూర్చోవడానికి కాదు.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి: రామ్‌గోపాల్ వర్మ

ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. సినీ నటులు- వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ప్రభుత్వం వేసిన కమిటీ తాత్కాలికంగా తాళాలు వేసినా.

దేశంలో హడలెత్తిస్తోన్న కోవిడ్.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి పాజిటివ్

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మళ్లీ ఒక్కొక్క రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి.