అడివి శేష్ 'మేజర్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'హృదయమా..' జనవరి 7న విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
ముంబై ఉగ్రదాడి అమరుడు మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా 'మేజర్'. ఈ చిత్రంలో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రను పోషిస్తున్నారు అడివి శేష్. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు హిందీలో భాషలలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాభవుతోంది. ఇటు ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 'మేజర్' మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ హృదయమా ఈ నెల 7న ఉదయం 11.07 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నారు.
శ్రీచరణ్ పాకాల 'మేజర్' చిత్రానికి అద్భఉతమైన సంగీతాన్ని అందించారు. 'మేజర్' మ్యూజిక్ మ్యాజిక్ హృదయమా పాటతో మొదలు కానుంది. ఈ పాటకు వీఎన్ వీ రమేష్, కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా..సిధ్ శ్రీరామ్ ఆలపించారు. హృదయమా అడివి శేష్, సాయీ మంజ్రేకర్ జంటపై చిత్రీకరించిన రొమాంటిక్ గా పాటగా పిక్చరైజ్ చేశారు.
ఇటీవలే ఈ సినిమా హిందీ వెర్షన్‌కి డబ్బింగ్ ప్రారంభించారు హీరో అడివి శేష్. ప్రపంచస్థాయి ఫిల్మ్ మేకింగ్ తో జాతీయ భావన, దేశభక్తిని కలిగించే ఉద్వేగ సన్నివేశాలతో 'మేజర్' సినిమా తెరకెక్కింది. గతంలో విడుదలైన 'మేజర్' టీజర్‌కి విశేషమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులంతా 'మేజర్' సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.
శోభితా ధూళిపాళ, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి మరియు మురళీ శర్మ ఇతర ప్రముఖ తారాగణం, ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు మలయాళంలో విడుదల కానుంది.
మహేష్ బాబు యొక్క GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన మేజర్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com