అందుక‌నే క్ష‌ణం మూవీకి క‌థ - స్ర్కీన్ ప్లే అందించినా డైరెక్ష‌న్ చేయ‌లేదు - అడ‌వి శేష్

  • IndiaGlitz, [Saturday,March 19 2016]

క‌ర్మ‌, కిస్, పంజా, ర‌న్ రాజా ర‌న్, బాహుబ‌లి...త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన యువ న‌టుడు అడ‌వి శేష్. తాజాగా అడ‌వి శేష్ ర‌చించి - న‌టించిన చిత్రం క్ష‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ర‌వికాంత్ తెర‌కెక్కించిన క్ష‌ణం విభిన్న క‌థా చిత్రంగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంటుంది. క్ష‌ణం రిలీజై 25 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా క్ష‌ణం క‌థానాయ‌కుడు అడ‌వి శేష్ తో ఇంట‌ర్ వ్యూ మీకోసం...

క్ష‌ణం ఎలా ప్రారంభ‌మైంది..?

క్ష‌ణం ఎలా ప్రారంభ‌మైంది అంటే...కోటి ప‌ది ల‌క్ష‌ల్లో ఈ సినిమా తీసాం. కానీ..అస‌లు జీరో బ‌డ్జెట్ తో ఈ సినిమా తీయాల‌నుకున్నాం. అదీ ఇంగ్లీష‌లు లో తీయాలనేది మా ప్లాన్. ఇంగ్లీషు లో తీసి కేన్ ఫిలిం ఫెస్టివ‌ల్ కి పంపించాల‌నుకున్నాం.అయితే.. ఒక‌రోజు అనుకోకుండా పి.వి.పి గారు కనిపిస్తే...ఇలా ఓ డిఫ‌రెంట్ మూవీ చేయాల‌నుకుంటున్నాం అని చెప్పాను. ఆయ‌న బిగ్ బ‌డ్జెట్ మూవీస్ తీస్తున్నాను అన్నారు. క‌థ వినండి న‌చ్చితే చేయండి లేక‌పోతే లేదు అని చెప్పాను. క‌థ విన్న త‌ర్వాత న‌చ్చింద‌ని చెప్పి రెండు రోజుల్లోనే ఆఫీస్ ఇచ్చారు. అలా క్ష‌ణం ప్రారంభ‌మైంది.

క్ష‌ణం కి వ‌స్తున్న స్పంద‌న ఎలా ఉంది..?

మేం ఊహించిన దానికంటే ఎక్కువ స్పంద‌న వ‌చ్చింది. నాలుగో వారంలో కూడా ఇంకా థియేట‌ర్స్ పెంచుతున్నారంటే రెస్పాన్స్ ఏరేంజ్ లో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. క్ష‌ణం రిలీజైనప్ప‌టి నుంచి ఈ నాలుగు వారాలు నా ఫ్రొఫెస‌న‌ల్ లైఫ్ లో బెస్ట్ డేస్ అని చెప్ప‌వ‌చ్చు.

క్ష‌ణం క‌థ - స్ర్కీన్ ప్లే మీరు రాసారు క‌దా...డైరెక్ష‌న్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం..?

నేను కిస్ అనే మూవీ తెర‌కెక్కించాను. ఈ సినిమాలో పాయింట్ బాగుంటుంది కానీ ఎందుక‌నో ఈ సినిమా ఆడ‌లేదు. ఈ సినిమా తీసి ఆర్ధికంగా న‌ష్ట‌పోయాను. ఆత‌ర్వాత న‌న్ను నేను తెలుసుకున్నాను. నా మ‌న‌సుకి న‌చ్చ‌న‌ది చేయ‌కూడ‌దు. న‌ట‌న - ద‌ర్శ‌క‌త్వం ఈ రెండూ ఒకేసారి చేయ‌కూడ‌దూ అని నిర్ణ‌యం తీసుకున్నాను. అందుక‌నే క్ష‌ణం క‌థ - స్ర్కీన్ ప్లే అందించినా డైరెక్ష‌న్ జోలికి వెళ్ల‌లేదు. ఇక నుంచి హీరోగా చేసిన సినిమాని నేను డైరెక్ట్ చేయ‌ను. నేను డైరెక్ట్ చేసిన సినిమాలో హీరోగా న‌టించ‌ను.

క్ష‌ణం సినిమాకి స్పూర్తి ఏమిటి..?

ఒక‌రోజు హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ లో కారులో వెళుతుండే స్కూలుకి వెళ్లుతున్న చిన్న పాప లిఫ్ట్ అడిగింది. ఆ పాప‌ను స్కూల్ లో దింపి ఆ ప్రిన్సిపాల్ ని పిల్ల‌ల కోసం బ‌స్ ఏర్పాటు చేయ‌చ్చు క‌దా అని అడిగితే...బ‌స్ ఏర్పాటు చేయ‌లేం అని చెప్పారు. పేరెంట్స్ కి ఫోన్ చేసి మాట్లాడితే మేము చిన్న‌ప్పుడు న‌డిచే స్కూల్ కి వెళ్లేవాళ్లం. మా పిల్ల‌లు కూడా అలాగే వెళితే ప్రాబ్ల‌మ్ ఏమిట‌న్నారు. వాళ్ల మైండ్ సెట్ అలా ఉంది. అప్పుడు నాకు అనిపించింది. లిఫ్ట్ అడిగిన‌ప్పుడు ఆ పాప‌ను ఎవ‌రైనా కిడ్నాప్ చేస్తే ఏమిటి ప‌రిస్థితి అనిపించింది. అలా వ‌చ్చిన ఆలోచ‌నే క్ష‌ణం క‌థ కి స్పూర్తి.

కొత్త‌గా డైలాగ్స్ - స్ర్కిప్ట్ గైడెన్స్ అబ్బూరి ర‌వి అని టైటిల్స్ లో వేయ‌డానికి కార‌ణం ఏమిటి...?

స్ర్కీన్ ప్లే నేను - డైరెక్ట‌ర్ ర‌వికాంత్ ఇద్ద‌రం క‌ల‌సి రాసాం. మేము రాసిన స్ర్కిప్ట్ లో ఛేంజేస్ చెప్పి మంచి అవుట్ ఫుట్ రావ‌డానికి అబ్బూరి ర‌వి గారు ఎంత‌గానో హెల్ప్ చేసారు. అలాగే సీన్స్ బాగా ఎలివేట్ అయ్యేలా సిట్యూవేష‌న్ కి త‌గ్గ‌ట్టు డైలాగ్స్ రాసారు. అందుక‌నే కొత్త‌గా డైలాగ్స్ - స్ర్కిప్ట్ గైడెన్స్ అని టైటిల్స్ లో వేసాం.

క్ష‌ణం త‌ర్వాత ఎలాంటి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి..?

పెద్ద ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. నాకే కాదు క్ష‌ణం టీమ్ లో చాలా మందికి మంచి ఆఫ‌ర్స్ వ‌స్తుండ‌డం ఆనందంగా ఉంది.

క్ష‌ణం క‌థ కాపీ అంటూ వ‌స్తున్న వార్త‌ల‌పై మీ కామెంట్ ఏమిటి..?

నేనూ.. విన్నాను క్ష‌ణం క‌థ క‌హానీ, అగ్లి...ఇలా డిఫ‌రెంట్ మూవీస్ నుంచి కాపీ చేసార‌ని అంటున్నారు. నేను బ‌ల్ల‌గుద్ది చెబుతున్నాను ఒక్క సీన్ కూడా ఎక్కడ నుంచి కాపీ కొట్ట‌లేదు. ఎవ‌రికైనా డౌట్స్ ఉంటే నా ద‌గ్గ‌రికి రండి..ఏ సీన్ ఎందుకు రాసానో వివ‌రించి చెబుతాను.

ఇక నుంచి హీరోగానే చేస్తారా..?

నేను న‌మ్మేది న‌ట‌న‌. నా ఫేవ‌రేట్ ఏక్ట‌ర్ ఎస్వీఆర్. అందుచేత హీరో క్యారెక్ట‌రా...విల‌న్ క్యారెక్ట‌రా అని చూడ‌ను. మంచి పాత్ర‌లు చేయాల‌నుకుంటున్నాను అంతే.

ఊపిరి సినిమాలో న‌టించారు క‌దా...మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉంటుంది..?

ఊపిరి లో న‌టించాను కాక‌పోతే పెద్ద క్యారెక్ట‌రేమి కాదు..చిన్న క్యారెక్ట‌ర్ ఇలా వ‌చ్చి అలా వెళ్లిపోయే క్యారెక్ట‌ర్. అది ఏమిటి అనేది ఊపిరి చూస్తే తెలుస్తుంది.

బాహుబ‌లి త‌ర్వాత మీలో వ‌చ్చిన మార్పు ఏమిటి..?

బాహుబ‌లి సినిమాలో న‌టించ‌డం గ్రేట్ ఫీలింగ్. బాహుబ‌లి త‌ర్వాత మార్పు అంటే నేను ఇంత ముందు ఎలా ఉన్నానో...ఇప్పుడు ఇలానే ఉన్నాను. నాలో ఎలాంటి మార్పు లేదు కాక‌పోతే న‌న్ను ఎక్కువ మందికి ప‌రిచ‌యం చేసింది బాహుబ‌లి అని చెప్ప‌గ‌ల‌ను. ఇక్క‌డో విష‌యం చెప్పాలి. ఊపిరి సినిమా షూటింగ్ కోసం ప్యారీస్ వెళ్లిన‌ప్పుడు నార్వే లో సెటిల్ అయిన త‌మిళ్ ఫ్యామిలీ ఫ్యారీస్ వ‌చ్చారు. వాళ్లు త‌మిళ్ బాహుబ‌లి చూసి మీరు బాహుబ‌లిలో న‌టించారు క‌దా అని అడిగి నాతో ఫోటో తీసుకున్నారు. అలా బాహుబ‌లి న‌న్ను ఎంతో మందికి ప‌రిచ‌యం చేసింది.

నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి..?

మ‌రో డిఫ‌రెంట్ స్టోరీ రాస్తున్నాను. సీరియ‌స్ గా కాకుండా స‌ర‌దాగా నెక్ట్స్ ఏమి జ‌రుగుతుందో అని చూసేలా ఈ క‌థ ఉంటుంది.