బాలీవుడ్ రీమేక్ లో అడివి శేష్...
Send us your feedback to audioarticles@vaarta.com
చేతన్ భగత్ రాసిన నవల `2 స్టేట్స్` నవల ఆధారంగా అదే టైటిల్‌తో బాలీవుడ్‌లో సినిమా చేసిన సంగతి తెలిసిందే. అర్జున్ కపూర్, అలియాభట్ హీరో హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత తెలుగులో రీమేక్ చేయాలనే ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లో నాగచైతన్య ఆ రీమేక్‌లో హీరోగా నటిస్తాడని న్యూస్ వచ్చింది. కానీ ఆ వార్తలు మరుగున పడ్డాయి.
తాజా సమాచారం ప్రకారం మళ్లీ ఈ రీమేక్‌కు సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి. `2 స్టేట్స్` రీమేక్‌లో ఇప్పుడు అడివిశేష్ హీరోగా నటిస్తాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెలువడనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments