సుమంత్‌కు శేష్ సహాయం
Send us your feedback to audioarticles@vaarta.com
చాలా గ్యాప్ తర్వాత గత ఏడాది మళ్ళీరావా చిత్రంతో సక్సెస్ అందుకున్న హీరో సుమంత్ ఇప్పుడు `ఇదం జగత్` అనే పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేశాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమా విషయంలో సుమంత్ కొద్దిగా సపోర్ట్ కావాలని శేష్‌ని అడిగాడట. సుమంత్ కోరిక మేర త్వరలో విడుదల కానున్న టీజర్‌ను కట్ చేయడంలో సపోర్ట్ చేశాడట శేష్.
ఈ విషయాన్ని సుమంత్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ శేష్‌కి థాంక్స్ చెప్పాడు.. అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో జొన్నలగడ్డ పద్మావతి, శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు కురియన్ హీరోయిన్. శ్రీచరణ్ పాకాల సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments