అడివి శేష్ 'గూఢచారి' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

  • IndiaGlitz, [Saturday,January 13 2018]

నటుడు - రచయిత అడివి శేష్ కొత్త చిత్రం 'గూఢచారి' ఫస్ట్ లుక్ సంక్రాంతి పండుగ సందర్భంగా నేడు విడుదలైనది. క్షణం, 'అమీ తుమీ' వంటి విభిన్న చిత్రాలతో విజయం అందుకున్న అడివి శేష్ ఈ సారి స్పై థ్రిల్లర్ తో మనముందుకు రానుండటం విశేషం. శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకుడు. తుపాకులు, బులెట్ లతో అధునాతనంగా డిజైన్ చేయబడిన 'గూఢచారి' ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రంపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఓ మంచి కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అడివి శేష్ గూఢచారిగా కనిపిస్తారు. అడివి శేష్ సరసన శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీం మిర్చంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవికి విడుదల చేయు సన్నాహాలు చేస్తున్నారు.

More News

'భరత్ అనే నేను' ఫస్ట్ లుక్ అప్ డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం భరత్ అనే నేను.

రకుల్ ను సిఫార్సు చేసిన కాజల్

ఇటీవలే కథానాయిక గా 50సినిమాలను పూర్తిచేసుకుంది అందాల నటి కాజల్ అగర్వాల్.

సరికొత్త పాత్రలో శ్రియ

శ్రియ ముఖ్య పాత్రలో కొత్త చిత్రం ప్రారంభమైనది.

పారిస్ లో బన్ని స్పెషల్ సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'.

దర్శకుడి మాట - మనస్సుకు దగ్గరైన 'మిఠాయి'

హలో ఫ్రెండ్స్,ఈ అనౌన్స్మెంట్ కి టైం పట్టింది.నిజం చెప్పాలంటే అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైంనే తీసుకున్నా.