G2: అడివి శేష్ G2 ఫస్ట్ లుక్ , ప్రీ-విజన్ విడుదల

  • IndiaGlitz, [Monday,January 09 2023]

HIT-2తో డబుల్ హ్యాట్రిక్ హిట్‌ లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh)ఇటీవలే తన తదుపరి ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ అయిన G2ని అనౌన్స్ చేశారు. గూఢాచారి ఇండియాలో సెట్ చేయగా, G2 ఇంటర్ నేషనల్ గా ఉండబోతోంది. ఈ చిత్రానికి కథను శేష్ స్వయంగా అందించారు.

“మేజర్”ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌ లను అందించిన ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌ లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌ లో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాట “ప్రీ విజన్” వీడియోను కూడా విడుదల చేశారు మేకర్స్. ఫార్మల్ అవుట్ ఫిట్ లో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌ లో ఉన్న శేష్ బిల్డింగ్ పై నుండి దూకుతూ తుపాకీతో ఒకరిని కాల్చడం కనిపిస్తుంది. ఈ సినిమా కోసం అడివి శేష్ మేకోవర్‌ అయ్యారు.

ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ ఇండియా నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి చివరి విజువల్స్ చూపించారు. ఆ తర్వాత G2లో అతని ఫస్ట్ లుక్‌ ని ప్రజంట్ చేశారు. 2023లో షూటింగ్‌ ప్రారంభమవుతుందని అనౌన్స్ చేశారు. కథ, మేకింగ్, సాంకేతిక ప్రమాణాలు, ఇంటర్నేషనల్ టీం పరంగా G2 అద్భుతంగా ఉంటుంది. పోస్టర్, ప్రీ-విజన్‌ లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

తారాగణం: అడివి శేష్

More News

Hunt : సుధీర్ బాబు హీరోగా 'హంట్' యాక్షన్ మేకింగ్ వీడియో విడుదల

నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudhir Babu) కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'.

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల, ఇలా బుక్ చేసుకోండి

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. రేపు ఆన్‌లైన్‌లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల

ATM: స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేకెత్తిస్తున్న జీ5 'ఏటీఎం'

టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్, స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్‌రాజు ఓటీటీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు.

Pawan- CBN: చంద్రబాబుతో పవన్ భేటీ.. ఏపీ రాజకీయాల్లో కలకలం, పొత్తులపై ఇద్దరి స్పందనా ఇదే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో

Bobby: చిరంజీవి గారు, రవితేజ గారితో కలసి సినిమా చేయడం నా అదృష్టం : దర్శకుడు బాబీ

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మాహారాజా రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య'