ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్...
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31వ తేదీన ప్రస్తుత ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుంది. అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అలాగే ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు.
సాధారణంగా ప్రస్తుత సీఎస్ పదవీకాలం ముగిసే సమయంలో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు వెలువడుతాయి. కానీ ఈసారి ఏపీ ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరించింది. ప్రస్తుతం ఆదిత్యనాథ్ దాస్ జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాగా.. నీలం సాహ్ని తర్వాత సీనియారిటీలో ఆమె భర్త అజయ్ సాహ్ని, తర్వాతి స్థానంలో సమీర్‌శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం, అభయ్ త్రిపాఠి, సతీష్ చంద్ర, జేఎస్వీ ప్రసాద్, నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వీరిలో అజయ్ సాహ్ని, సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యం కేంద్ర సర్వీసుల్లో ఉండగా, అభయ్
కాగా.. ఆదిత్యనాథ్‌దాస్ జూన్ 1961లో బిహార్‌కు చెందిన డాక్టర్ గౌరీ కాంత్ దాస్, కుసుం కుమారి దంపతులకు బిహార్‌లో జన్మించారు. ఆయన 1987వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. బెనారస్ హిందూ యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ (1980-84), ఢిల్లీలోని జేఎన్‌యూలో ఇంటర్నేషనల్ స్టడీస్(1984-86) చేశారు. విజయనగరం, విజయవాడ అసిస్టెంట్ కలెక్టర్‌గా, కృష్ణా జిల్లా జేసీగా, వరంగల్ కలెక్టర్‌గా, మురికివాడల అభివృద్ధి పథకం పీడీ, అదనపు కమిషనర్, మునిసిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్, నీటి పారుదల శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా ఆదిత్యనాథ్ సేవలందించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com