PM Modi:అంతరిక్షంలో ఆదిత్య ఎల్-1' ప్రయోగం సక్సెస్.. ప్ర‌ధాని మోదీ హర్షం..

  • IndiaGlitz, [Saturday,January 06 2024]

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో(ISRO)మరో ఘనత తన ఖాతాలో వేసుకుంది. సూర్యుడి రహస్యానాలను అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపి ఆదిత్య ఎల్‌-1(Aidtya L1) విజయవంంగా త‌న గ‌మ్య‌స్థానాన్ని చేరుకుంది. 125 రోజుల పాటు అంత‌రిక్షంలో ప్ర‌యాణించిన ఆదిత్య ఎల్‌-1 సూర్యుడి నుంచి 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలోని ల‌గ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న హాలో క‌క్ష్య‌లోకి చేరుకుంది. ఈ ఉపగ్రహం ఐదేళ్ల పాటు హాలో కక్ష్య నుంచి ఇది నిరంతరం సూర్యుడిని పర్యవేక్షించనుంది.

ఆదిత్య ఎల్-1 ప్రయోగం విజయంవంత కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గ‌మ్య‌స్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధార‌ణ విజ‌యం సాధించిన శాస్త్ర‌వేత్త‌ల‌కు అభినంద‌న‌లు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్ర‌సాంకేతిక రంగంలో ఉన్న‌త శిఖ‌రాల‌ను చేరుకునే ప్ర‌యాణం కొన‌సాగుతోంది అని తెలిపారు.

కాగా సౌర కుటుంబం రహస్యాలను లోతుగా అధ్యయనం చేసేందుకు 'ఆదిత్య L1' ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. గతేడాది సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ - 57 వాహక నౌక ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టింది. సౌర తుఫానుల కారణంగా కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే ప్రమాదకర తరంగాల వల్ల విద్యుత్ వ్యవస్థకు సైతం ముప్పు కలిగించే అవకాశాలున్నాయి. అందుకే అలాంటి ముప్పులను అడ్డుకునేందుకే ఇస్రో ఈ ప్రయోగం చేపట్టింది.

ఇటీవల బ్లాక్ హోల్ పరిశోధన కోసం ఇస్రో ఎక్స్‌పోశాట్(XPoSat) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన సంగి తెలిసిందే. అమెరికాకు చెందిన నాసా తర్వాత ఈ ప్రయోగం చేపట్టిన రెండో దేశంగా భారత్ నిలిచింది. అలాగే గతేడాది చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్‌తో ఇస్రో.. ప్రపంచంలో సరికొత్త చరిత్రను సృష్టించిన సంగతి తెలిసిందే. మొత్తానికి అంతరిక్షంలో భారత్ జెండా రెపరెపలాండించేందుకు ఇస్రో ప్రయత్నాలు అభినందనీయమని నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

More News

Anganwadi workers:అంగన్‌వాడీ వర్కర్లపై 'ఎస్మా' అస్త్రం సంధించిన ప్రభుత్వం

తమ డిమాండ్లు నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

Kesineni Nani: పొమ్మనలేక పొగబెట్టారా..? కేశినేని నానికి చంద్రబాబు చెక్..

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అసలు స్వరూపం బయటపడుతోంది. ఇప్పటిదాకా పార్టీ మనుగడ కోసం నాటకాలు ఆడిన చంద్రబాబు అసలు విశ్వరూపం ఇప్పుడు బయపటపడింది.

KTR:హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్ రద్దుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా ఈరేస్‌(FEO) రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన మున్సిప‌ల్ శాఖ‌..

Thandel:ఈపాలి ఏట గురితప్పదేలే.. చైతూ'తండేల్' గ్లింప్స్ అదిరింది..

అక్కినేని హీరో, యువ సామ్రాట్ నాగచైతన్య(Naga Chaitanya)హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో

Prajapalana:ప్రజాపాలన కార్యక్రమానికి నేడే చివరి తేదీ.. దరఖాస్తు చేసుకున్నారా..?

తెలంగాణలో ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో పాటు ప్రభుత్వ పథకాల అమలు కోసం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమం నేటితో ముగియనుంది.