నాగ్‌తో అదితిరావు హైదరి...
Send us your feedback to audioarticles@vaarta.com
కింగ్ నాగార్జున ఇప్పుడు రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. అందులో ఒకటి బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర' కాగా.. మరో చిత్రం తెలుగు, తమిళంలో రూపొందుతుంది. గురువారం ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
ధనుష్ హీరోగా నాగార్జునతో నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో ఆదితిరావు హైదరి హీరోయిన్గా ఎంపిక కావడం విశేషం. తెలుగులో ఈ ఏడాది సమ్మోహనంతో సక్సెస్ అందుకున్న అదితి.. వరుణ్‌తేజ్‌తో అంతరిక్షం సినిమాలో కూడా నటిస్తుంది.
త్వరలోనే ఈమె నటించిన నవాబ్ ఈ నెలలోనే విడుదల కానుంది. కాగా తమిళంలోనే మిస్కిన్ దర్శకత్వంలో 'సైకో' సినిమాలో కూడా అదితి నటించనున్నారు. తెలుగు కంటే కోలీవుడ్‌లోనే అదితి వరుస అవకాశాలను అందుకుంటుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments