మహేష్ సినిమాలో అదితిరావ్ హైదరీ?
Send us your feedback to audioarticles@vaarta.com
సమ్మోహనం చిత్రంతో ఆకట్టుకున్న కథానాయిక అదితి రావ్ హైదరీ. ఇందులో సమీరా రాథోడ్‌గా నటించి.. అందరి దృష్టిని ఆకర్షించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం అదితి.. వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్న స్పేస్ మూవీలో ఓ కథానాయికగా నటిస్తోంది. అలాగే మణిరత్నం మల్టీస్టారర్ మూవీ నవాబ్‌లోనూ ఓ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ముద్దుగుమ్మని ఓ బంపర్ ఆఫర్ వరించిందని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే ఓ కథానాయికగా నటిస్తుండగా.. కథకు కీలకమైన పాత్రలో అదితి రావ్ హైదరీ నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అదితి ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com