డబ్బింగ్ చెప్పుకుంటున్న అదితిరావ్ హైదరి
- IndiaGlitz, [Saturday,May 05 2018]
‘చెలియా’ సినిమాలో నటించి మంచి మార్కులనే సంపాదించుకుంది హైదరాబాదీ అమ్మాయి అదితిరావు హైదరి. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘సమ్మోహనం’ సినిమాలో నటించింది. ఇటీవల విడుదైలెన టీజర్‌కు మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ఆసక్తికరైమెన విషయవేుమంటే.. ఈ టీజర్లో అదితి తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుని ఉండటం. ‘సినిమా చిత్రీకరణ సమయంలో నా పాత్రకు నేను డబ్బింగ్ చెబితే బావుంటుందని డైరెక్టర్‌గారు అడిగారు. ఆయన చెప్పడంతో సరేనన్నాను.
నేను ఇక్కడే పుట్టాను కాబట్టి నాకు తెలుగు వచ్చునని చాలా మంది అనుకుంటారు. అయితే అసలు విషయవేుమంటే.. నేను నార్త్‌లో పెరగడం వల్ల నాకు తెలుగు భాష రాలేదు. చాలా చరిత్ర ఉన్న సుందరమైన భాష తెలుగు. ఈ భాషలో డబ్బింగ్ చెప్పడానికి చాలా కష్టపడ్డాను. ప్రస్తుతం తెలుగు కొంత అర్థమవుతుంది. కానీ మాట్లాడలేన’ని తెలిపారు హైదరి.