సుధీర్‌తో అదితి.. డౌట్‌లో పడింది
Send us your feedback to audioarticles@vaarta.com
జెంటిల్‌మాన్, అమీతుమీ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని సొంతం చేసుకున్నారు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ప్రస్తుతం ఆయన యువ కథానాయకుడు సుధీర్‌బాబుతో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగా, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి అదితి రావ్ హైదరీ హీరోయిన్‌గా కన్‌ఫర్మ్ అయిందన్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ ప్రకారం.. అదితి విషయం డైలమాలో ఉందని తెలిసింది. ఈ సినిమాని బడ్జెట్ కంట్రోల్ తో తీయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుందట. అయితే అదితి మాత్రం కాస్త ఎక్కువ పారితోషికాన్నే డిమాండ్ చేస్తోందని.. ఆ విషయంలో క్లారిటీ వచ్చాకే ఆమెని హీరోయిన్‌గా తీసుకోవాలా వద్దా అని టీమ్ డిసైడ్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎక్కువగా హిందీ చిత్రాల్లోనే నటిస్తూ వస్తున్న అదితి.. ఇటీవలే మణిరత్నం, కార్తీల తమిళ అనువాద చిత్రం చెలియాలో హీరోయిన్‌గా నటించింది. తెలుగులో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. మరి.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ ఇంద్రగంటి సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సిన అదితి.. ఆ ఆఫర్‌ని నిలబెట్టుకుంటుందో.. పారితోషికం విషయంలో బెట్టు చేసి పొగొట్టుకుంటుందో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments