చెరుపల్లి గ్రామాన్ని సందర్శించిన ఆదిత్య ఓం
Tuesday, February 2, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
ఖమ్మం జిల్లా, భద్రాచలం సమీపంలోని చెరుపల్లి గ్రామాన్ని దత్తత తసుకుంటున్నట్లు ప్రకటించిన హీరో ఆద్యిత ఓం ఇటీవల ఆ గ్రామాన్ని సందర్శించారు. తాను ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ 'ఎడ్యులైట్‌మెంట్' మరియు భద్రాచలం డివిజన్‌కి చెందిన స్వచ్ఛంద సంస్థ 'ఆనందం ఫౌండేషన్' కలిసి సంయుక్తంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ముందుగా పిఎస్ఆర్ లైబ్రరి పేరుతో ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. అలాగే క్రీడా వస్తువులను స్థానిక స్కూళ్ళలో అందించారు.
ఈ సందర్భంగా హీరో ఆదిత్య ఓం మాట్లాడుతూ ''దర్శకనిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి సలహా మేరకు చెరుపల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నాను. చుట్ట పక్కల గ్రామాల నుంచి కూడా 10 వేల మందికి పైగా ప్రజలు నన్ను హారతులు, మేళాలతో ఊరేగించిన తీరు నన్ను ఉద్వేగానికి గురి చేసింది. 10 సంవత్సరాల దీర్ఘ ప్రణాళికతో ఈ గ్రామాభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించుకున్నాను'' అన్నారు.
హీరో ఆదిత్య ఓం తమ గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందని దర్శకనిర్మాత విజయ్‌వర్మ పాకలపాటి అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments