తేజ్ తిక్క ఆడియో హక్కులను కైవసం చేసుకున్న ఆదిత్యా మ్యూజిక్
Friday, July 29, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరో గా , లారిస్సా బోనేసి హీరోయిన్ గా నటించిన చిత్రం తిక్క. ఓమ్ ఫేమ్ సునీల్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రోహిన్ రెడ్డి మరియు బి. ఆర్. బుగ్గినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆడియో హక్కులను ఆదిత్యా మ్యూజిక్ కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఆదిత్యా మ్యూజిక్ ప్రతినిధి స్పందిస్తూ... ఈ చిత్రం ఆడియో హక్కులను దక్కించుకోవటం ఎంతో ఆనందం గా ఉంది. ఈ చిత్రం ఆడియో ను ఈనెల 30 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి థమన్ చక్కటి సంగీతాన్ని అందించారు. ధనుష్, శింబు వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రం లో రెండు పాటలను పాడటం ఈ ఆల్బం హైలైట్ అని తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments