అదితిరావు స్వీటెస్ట్ పర్సన్: నివేదా థామస్
Send us your feedback to audioarticles@vaarta.com
హీరోయిన్ అదితిరావు హైదరీ స్వీటెస్ట్ పర్సన్ అని నివేదా థామస్ తెలిపింది. నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన ‘వి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నివేదా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది. ఈ సినిమా నాని, నివేదా, అదితితో పాటు సుధీర్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరితోనూ తనకు మంచి అనుబంధం ఉందని నివేదా తెలిపింది. ప్రతి ఒక్కరూ వారి పాత్రలకు జీవించేశారని నివేదా చెప్పుకొచ్చింది.
ఇక తన సహ నటి అదితి గురించి మాట్లాడుతూ.. ‘‘నా సహనటి అదితిరావు హైదరి స్వీటెస్ట్ పర్సన్. గొప్ప నటి. తనైనా, నేనైనా, మరేవరైనా మా పాత్రకు న్యాయం చేయాలనే ప్రయత్నించాం. గొప్పగా నటించడానికి ప్రయత్నించాం. అలా చేశాం కాబట్టే సినిమా బాగా వచ్చింది’ అని తెలిపింది. వి’ సినిమా లాక్డౌన్ కంటే ముందుగానే పూర్తయ్యిందని తెలిపింది. ఈ సినిమా నిర్మాతలకు నటిగా తమ టీమ్‌తో కలిసి సపోర్ట్ చేస్తున్నానని నివేదా తెలిపింది. ఇప్పుడున్న పరిస్థితులు అలాగే కొనసాగవని... త్వరగానే అంతా సెట్ అవుతాయని తెలిపింది.. రెమ్యునరేషన్ విషయంలో తానూ నిర్మాతలకు సపోర్టివ్‌గానే ఉంటానని నివేదా చెప్పుకొచ్చింది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, హర్షిత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటి వరకు థియేటర్స్ కోసమే ఎదురు చూసిన ఈ చిత్రం.. పరిస్థితుల్లో మార్పులు లేకపోవడంతో.. ఓటీటీ ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారు. అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబర్ 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. నాని, సుధీర్ పాత్రలు ఈ సినిమాపై విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేశాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com