అరవీర భయంకరుడు అధీరా.. కేజీఎఫ్ 2లో సంజయ్ దత్ లేటెస్ట్ లుక్
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సీనియర్ నటుడు, వివాదాలకు నెలవు అయిన సంజయ్ దత్ పుట్టినరోజు నేడు. సంజయ్ దత్ 62వ పడిలోకి అడుగుపెట్టారు. నటుడిగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న సంజు.. అనేక వివాదాల్లో చిక్కుకుని జీవితంలో ఎన్నో కష్టాలు కూడా ఎదుర్కొన్నారు. ఆఖరికి జైలు శిక్ష కూడా గడిపారు.
Also Read: 'మహా సముద్రం' మోషన్ పోస్టర్.. వావ్ అనిపించేలా సిద్దార్థ్, శర్వా లుక్స్!
ప్రస్తుతం సంజయ్ దత్ ఇండియాస్ మోస్ట్ వైటెడ్ చిత్రాల్లో ఒకటి అయిన కెజిఎఫ్ 2లో విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అధీరా పాత్రలో సంజు కనిపించబోతున్నాడు. నేడు చిత్ర యూనిట్ అధీరా లేటెస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అధీరా లుక్ లో సంజయ్ అరవీర భయంకరంగా కనిపిస్తున్నాడు.
తన వెనుక కెజిఎఫ్ సామ్రాజ్యం ఉండగా అధీరా ఖడ్గం చేతబట్టి నడుచుకుంటూ వస్తున్న లుక్ ఒక రేంజ్ లో ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధీరా పాత్రని ప్రతిభింబించేలా ఓ కామెంట్ పెట్టాడు. 'యుద్ధం పురోగతి కోసమే.. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే- అధీరా' హ్యాపీ బర్త్ డే సంజయ్ సర్ అని ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.
యష్ హీరోగా నటించిన కెజిఎఫ్ మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘనవిజయం సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. దీనితో కెజిఎఫ్ 2పై కనీవినీ ఎరుగని అంచనాలు నెలకొని ఉన్నాయి. గరుడని అంతమొదించడంతో మొదటి భాగం ముగిసింది. రెండవ భాగంలో అసలైన విలన్ అధీరా ఎంట్రీ ఇవ్వనున్నాడు. యష్, సంజయ్ మధ్య పోరాటం ఏస్థాయిలో ఉంటుందో అని ప్రత్ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
"War is meant for progress, even the vultures will agree with me" - #Adheera, Happy Birthday @duttsanjay sir.#KGFChapter2 @TheNameIsYash @VKiragandur @hombalefilms @TandonRaveena @SrinidhiShetty7 @excelmovies @VaaraahiCC @PrithvirajProd @DreamWarriorpic @LahariMusic pic.twitter.com/VqsuMXe6rT
— Prashanth Neel (@prashanth_neel) July 29, 2021
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com